పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


మిన్నేటిగట్టుపై మిడుకుదునందునా
            కొంటెకన్నియ లీఁతగొట్టు చోటు
నందనోద్యానంబునందుందు నందునా
               గోవాండ్ర గమిగుంపు గూడుచోటు
పొన్నారి పొదరిండ్లఁ బన్నుందునందునా
             కాముకీ కాముకుల్ గలీయు చోటు
కొండనె త్తము లెక్కి కూర్చుందునందునా .
             చొరవతోఁ బ్రోబ్రోఈయాంద్రు తిరుగుచోటు
కానమిటఁ జాటుచోటొక్క జేనెడైన
              మౌని జనవాస యోగ్యమౌదాని నకట !
బాగు! శివ! శివా!!! యిది వట్టి భోగభూమి
             యుండరాదిందు మావంటి యోగులకును.



అని తలంచుచుఁ జేతికందు దూరంబులోనున్న పరి ష్కృత నిష్కంటంబును జేరి, కృష్ణాజినంబు సెజ్జగాఁ జేసికొని నాఁటి ప్రొద్దెల్లఁ జూచిసవింతవింతసంగతులనుగూర్చివిచారించు కొనుచు, నిదురంబోయి, సర్వభూతమనఃప్రియంబగు నుషః కాలంబున నే లేచి యమరనదికింజని కాల్యంబులఁ దీర్చికొని, చల్ల నినీటస్నానంబాడి మెల్లని పరిమళవాయువులచే సేదఁ దేరి, కక్షపాలనున్న భస్మంబునుదీసి, యన్యమనసుండనై, మై సలందికొని చూచుడు భస్మలేపనంబు, పుప్పొడిపూఁతయయ్యె..

44