పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీ యా శ్వాస ము


ఆలకింపుము స్వర్లోకమందునున్న
మానినులయందుఁ బెండ్లిండ్లు లేని కార
ణమున మరులెత్తి మర్త్యలోకము, దేశ
దేశముల పయింబడీ వారు తిరుగుచుంద్రు,


మగవాండ్రిచ్చట నుండరు.
మగనాడ్రన్నన్ దెలియదు మాబోంటులకున్
మగవాండ్ర మనుచు మాపై
మగబీరముఁ జూపరారు మా మగవారల్.



అనీ నిష్కపటంబుగా వచియింప స్వర్గలోక నాగరికంబు నకు నాలో నే సేవపడి, యేమిచేయుటకుఁ దోఁచక, మెల్లన లేచి, ప్రక్కకొదిగి పోవుచుండ సురాంగన సన్నుజూచి కేరింత లాడ నిట్లు దలపోయఁదోడంగితి.



కల్లునిచ్చెడి చెట్లకుగల్లు గౌర
వంబు పేరవానికిని లేదు, వజ్రి మోల
గజ్జకట్టెడి బోగంపుగరితకున్న
పలుకుబడి కానరా దెట్టివారీ కిందు


ఇంట్లో యున్నవి కాని పెండ్లిండ్లు లేవు
ఆండ్రో యున్నారు కాని యిల్లాండ్రు లేరు
బాగు ! శివ ! శివా!! యిది వట్టి భోగభూమి
యుండరాదిందు మావంటి యోగులకును,


43