పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము



నెల్ల గౌరుఁ జూచి నెల్ల జక్కి–నిజూచి
కల్ప పంచకంబుఁ గనులఁజూచి
నందగోపననము నాల్గుమూలలుఁజూచి
వేల్పుపౌఁజుఁజూచి వెడలుచుంటి.


ఇంతలోఁ బడమదిక్కునకుఁ బొద్దుగాలఁగై వాలు టయుఁ, బెద్దతడవు విరామంబు లేక నలుదిక్కులు మల్లాడు టయు, విపరీతంబులు పెక్కు జూచి మనంబు చెదరుటయుఁ; జేయునది లేక...



కొంచెము విశ్రామంబును
గాంచఁదలఁచి యొక్క చెట్టుకడ కేగంగాఁ
బొంచి లతాంగి యొకత నా
వంచకురా నా మెతోడఁ బల్కితి నీటులన్,


ఇందఱు యువతీ యువకులు
క్రిందుగ నున్నట్టి చోటఁ గన్పించ రహో !
చిందులు తెగఁదొ క్కెడి కసి
గందులు వచియింపుమమ్మ కారణ మన్నన్


స్వైరవిహార నిష్ఠ మెయి సర్వదిగంతర దివ్య దేశ సం
చారముఁ జేయు మాకు గ్రహచారము చాలక సంతుగల్గినన్
వారల నెల్ల గన్న "మగవారికి నిత్తుము కాని పెంచు నా
చారము లేదు స్వర్గమున సత్యముఁ జెప్పితిసంచు నా మేయున్,

42