పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'సూత పురాణము



వెన్నాడు గోవాండ్రునుగల్గి నిత్యకల్యాణము పచ్చతోరణమై వెలుంగుచుండ 'నే నిటుసటు తిలకించుచుండ.............



కొమ్ము పేంగొక పొదరిల్లు గ్రుమ్మి వైవ
సంగ మొలతో సురాంగన యంగ వైచే
సంగదట్టము విడివడ్డ నంగరాగ
మంగహారముచేఁ జాలగంగవింప


గుబ్బలిమాటునన్ సురలకోసము పెట్టిన యొక్క యంగడిన్
గబ్బలికన్నె చెన్ను గని కై వణఁకన్ సుర చింది ముంగిటన్
బొబ్బిలఁ ద్రాగుఁబోతు లటసోలుచుఁ దూలుచునుండ దారి పె
న్ను బ్బలియైన నందనము నొక్కెడఁగంటినీ ఉచ్చపాటుతో.


జూరుసిగలోన కోడంగిసరులు
తురీమి జరుపయ్యెంటలోన మందార ముంచి
నీటుతో నెలకట్టు పై నిక్కి నడువ
జూరణీస్త్రీ యొకత కాలుజారిపడియె,


తీగ తూగుటుయ్యాలలోఁ దీగబోఁడిఁ
గూడి జోడుగ నొక వేల్పుకోడెఁకాడు
కౌగిలింతల పొంగులోఁ గాలుజారఁ
గోకినల్ గొట్ట నెడ కాండ్రు క్రిందఁ బడియె.

40