పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


అనివార్యంగా హోటలు మానేజరు దగ్గరకు వెళ్ళి, “13 నెంబరు గది కావాలి?” అని అడిగేవారు. మేనేజరు కాసేపు తెల్లబోవటం; మనిషిని ఎగాదిగా చూడటం; చివరకు తీసుకు నెళ్ళీ చూపటం.


ఇతరులకు 13 నెంబరు పడదు; రామస్వామిగారికి మాత్రం ఆ నెంబరే కావాలి!. . .స్వదేశాగమనం. బందరులో పాక్టీసు. మళ్ళీ సంఘ సేవా, సారస్వత సేవా మొదలు. మళ్ళీ సంగ్రమం మొదలు. బాహ్మణేతరోద్యమమూ, ఉపన్యా సాలూ, ప్రచారమూ, దిసపత్రిక నడపటానికి బెజవాడ నివా సం. ఇంగ్లండునుండి స్వదేశంలో అడుగు పెట్టగానే జస్టిస్ ఫార్టీకి వ్యతిరేకంగా జరిగిన బ్రాహ్మణేతర మహాసభకు అధ్యక్షత..


రైతుపత్రికా సంపాదకులుగా తెనాలి ఆగమనమ్. పత్రిక ద్వారా మళ్లీ సంగ్రామం.


శంబుకవధ ప్రచురణ. రాముడు శంబుకుని చంపుట అధర్మమనీ, ద్రావిడులను దాస్వంలో ఉంచటానికి వసిష్ణుల వారు పన్నిన కుట్రనీ, ఆర్యకుతంత్రంవల్ల రామరాజ్యంలో ద్రావిడులకు భగవంతుని పూజ చేసుకునే హక్కు కూ లేదనీ దీని సారాంశము. ఈ స్వాతంత్ర్యముకోసం శంబుకుడు తన ప్రాణాలను అర్పించాడు. " ఈ పుస్తకానికి కలిగిన వ్యాప్తి తెలుగులో మరే పుస్తకానికీ కలగ లేదు. దక్షిణాఫ్రికా వెళ్ళింది, ఊరూరూ తిరిగింది, ఉద్రేకం పెంచింది. వివాదాలూ


16