పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయా శ్వాసము


ప్రజలయం దెచ్చులొచ్చులు వర్థిలంగ
స్మృతులు వ్రాయించు భూపతుల్ స్మృతులు వ్రాయు
పండితావళియున్న భూమండలం బె
యదుపు లేనట్టి మ్లేచ్ఛ రాజ్యంబు నుమ్ము,


ప్రజల సమదృష్టితోఁజూచి రాష్ట్రమందు
నీతిబాధలు లేకుండ నీతిగల్లి
ప్రజలఁబ్రోచుట రాజధర్మంబు కానీ
పక్షపాతంబుఁ జూపింపఁ బాడియౌనె?


ఈ సూటిపోటు మాటలకు మను వులికిపడి క్షుణకాలం బాగి యీ విధంబుగాఁ జెప్పఁదొడంగె.



అప్రతిమాస బుద్దిధనులై స్మృతులం దలకిందు సేయు మా
వివులు కొందరట్టె పలవించి కడున్ 'బలవంత పెట్టఁగా
నప్రతిభుండనై జడుఁడనై స్మృతి వ్రాసితినన్ క్షమింపుఁడీ
క్షిప్రగతిన్ బ్రమాదపడి చేసిన కార్యముగాన గీష్పతీ !



అనుమాట లాలకించుచు ,
సనిమిషగురు డంతఁ బల్కె నాతముతోడన్
వినుమని శ్రద్దాభక్తుల
మనువు సమాలింపనుండె మక్కువతోడన్


37