పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా న ము


జాతులఁబట్టి మేము స్మృతిసంహితలన్ రచియింపలేదిటన్
జాతులఁబట్టి తప్పులు విచారణఁ జేయము శిక్ష చెప్పఁగన్
జాతులఁబట్టి ధర్మము ప్రచారము సేయము బందుకట్టి నీ
భూత దయాగుణంబునకు మోదము నందితి జెప్ప నేటికిన్ !


అజ్ఞాను లొనరించు నపరాధముల కెల్ల
              సతిమాత్ర శిక్షలు న్యాయమయ్య ?
జ్ఞాను లొనర్చు దోషముల కన్నింటికి
              నామమాత్రపు శిక్ష న్యాయమయ్య !


ఒకరీతి నేరంబునకుఁ బెక్కు–రకముల
               దండనల్ విధియింప ధర్మమయ్య !
భరతవర్షమునందుఁ బ్రజలకు ధర్మైక్య
              సంచారమును మాన్పఁ బాడియయ్య !


ఆంధ్రులను మ్లేచ్ఛజాతులయందుఁ జేర్చి
వ్రాసి పెట్టితివిదియేమి పాపమయ్య ?
ఆంధ్రజాతి గూరిచి యెట్టి యానుపాను "
తెలియకుండంగ స్మృతి నేల పలికితయ్య?

వానవంగుళ్ళకోర్చి రేఁ బవలు రెప్ప
వాల్ప కూడిగం బొనరించు ప్రోతలకును
బాత, యంగిలీ, పొల్లును బ్రతిఫలంబ?
టంచుఁ జెప్పితి విది యెట్టి న్యాయమయ్య !


35