పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా న ము


అంత నా గబ్బుగొట్టుటచే నక్కిరిబిక్కిరియైనటులుండి యేమియుఁ దోఁచక, నే నిటునటు పోయి పోయి, కోలువు దీర్చియున్న వేలుపు సురతాణిహజారముం జేరి, మణిమయ పట్టభంగమ్ముల భంగమ్ము నందక దౌవారికులం ద్రోసికొని, విండోలగంబుఁజొచ్చి విలోకించుడు---


ప్రాచీనబర్హి విలసత్
ప్రాచీ దిక్పాలకుండు తగఁ గూర్చుండెన్
బ్రాచీన బర్హిపీఠిని
వాచంయమి గణము కొల్వఁబ్రాభవ మొప్పన్


మోళీకట్టెడువాని మోచేయికడనుండు
              కోలెమ్ము కొకపక్క గునిసియాడ
దనుజుం డొనర్చిన దండచే మచ్చలు
                 ఫునుఁగు పూఁతలలోసఁ బోనుఁగుపడగ
జారుచుండిన.యౌడు సవరించుకోని తుంబు
                 రుండు పాటలు పాడి రోప్పుచుండ
తెఱగంటి బోటులు తేఱచిన కనులతో
                  వింజామరలుపట్టి వీచుచుండ



రాజసంబు దీపింపగా భాజమాన
విమల చింతామణి భదపీఠమందు
సంగజాలలు సందడి సాగుచుండఁ
కొలువు దీర్చి మహేంద్రుండు కూరుచుండె,


31