పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వాస ము


చక్కని రాచబాటఁబడి సాఁగుచుఁబోవ నొజోశోకవృక్షముల్
చిక్కని పూవుఁ దేనియలు చింది పయింబడఁగార్చు చుండఁగా
మక్క–ని జంపుజొంపముల మాటున డాగిన పూవుగుత్తులున్
జిక్కణవైనరీతి విరజిమ్ముచునుండెను గమ్మతావులున్.


చల్లనిమ్రాకుల నీడను
మల్లానుచునుండ నూర్గమధ్యమునందున్
దెల్లని యుడుపుల దొడిగిన .
గల్లంతులమారి జాణ గకవిక సవ్వెన్

వలిపంపుఁ జేరఁగట్టియుఁ
గలపంబునుబూసి కర్ణికారముఁ జెవులన్
నెలయఁగ సొగసుగ నిల్చిరి
నలభీపార్శ్వంబులందుఁ బల్లవపానుల్.


కలకల ననుచు దిశలన్
గిలకలమను నెమ్మొగంబు కాంతులు పర్వన్
గోలకంఠస్వరములతో
గలవాణులు పాడుచుండఁగా విని యంతన్ ,


రాచబాటను విడనాడి పక్కనున్న
చంద్ర కాంతశిలాచయస్థగితమైన
వీథి బడి పోవుచుండఁ దివిష్టపమునఁ
గానరానీ విడ్డూరముల్ గానిపించే

29