పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


"చూషవ్"

"చూపను”

"అరెస్టు చేయిస్తా !"

“చూస్తాను.”


అది జపాన్ ఓడ. కెప్టెన్ వచ్చి బతిమాలాడు.విన లేదు. కెప్టెన్ వెళ్ళి ప్రభుత్వపు ప్రతినిధితో మాట్లాడాడు. తిరిగివచ్చి, “డర్బన్ చూట్టానికి వెళ్ళవచ్చు' అని చెప్పాడు. “ఏషరతులతో”, అని రామస్వామిగారు అడిగారు. నేను స్యూరిటీ వున్నాను, అని కెప్టెన్ చెప్పాడు. అయితే నేను దిగాదిగను–ప్యాస్ పోర్టు చూపాచూపను”, అని రామస్వామి, గారి జవాబు. "కెప్టెన్ కేమి తోచలేదు. అప్పటికే గంట ఆలస్యమయింది. గంట ఆలస్యమంటే యెంతో డబ్బునష్టం, మళ్ళీ వెళ్ళి ప్రభుత్వ ప్రతినిధితో మాట్లాడి రామస్వామిగారి దగ్గరకు నవ్వుతూ వచ్చి, “మీరు ఏ షరతులూ లేకుండానే దిగవొచ్చు” అనీ చెప్పాడు. అప్పుడు రామస్వామిగారు తన ప్యాస్ పోర్టు చూపారు.


ఇక్కడ మరొక మాట చెప్పాలి. యూరప్ లో ప్రయా ణం చేసేటప్పుడు రామస్వామిగారు పతిహోటల్లోనూ 18. నెంబరు గదిలోనే మకాం. ఎందుకో తెలుసా? 18 నెంబరు మంచిది కాదని . సాధారణంగా తెల్ల వాళ్లెవరూ ఆ నెంబరు గదిలో వుండరు. అందుకని అద్దెతక్కువ. రామస్వామిగారు.


15