పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయా శ్వాస ము


గగనంబులోనుండి గంగమ్మ శివుమస్త
                మున దూఁ కే ననుమాట ములుచమాట
అతి తపోనియతిచే నల భగీరథుఁడు గం
                గను దెచ్చె ననుమాట కల్లమాట
గంగాజలంబుచేఁ గంధి నిండింపగా
               బడి యే సుమ్మనుమాట బడుగుమాట
శైవ జటాజూట సక్తయై తిరుగాడే
              వేల యేండ్లనుమాట వెర్రిమాట

సగర సుత భస్మరాసుల సరవి దడిపి
స్వరమునకంపె ననుమాట వట్టిమాట
టక్కు నేర్పెడి కవుల గంటాలవ్రాత
కాదనఁగరాదుప్రాచీన కవులుగాన,


గంగామూల మోరుంగఁగోరి సగరక్ష్మానేతృ పౌత్రుండు వే
గంగాకూలముఁ బట్టిపోయి తుదకుం గార్యంబు సొథింప శీ
ర్ణాంగుండై మరణించెఁ దత్కథను బర్యాలించి తత్పుత్రుఁడు
త్తుంగఖ్యాతిని బోం దెఁ బటినపనిన్ దుర్వారుఁడై . తీర్చుచున్,


గంగాతటినీమూలము
సాంగముగ నెరింగి భగీరథాఖ్యుఁడు పృథుకీ
ర్తింగ నే భాగీరథియని
గంగా శైవలిని దాని గణుతికి నెక్కెన్.