పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయా శ్వా న ము

దేవతాలోక మేదిక్కున వెలుగొందు ?.
కాలమానం బెట్టు గడలునందు ?
దేవత లేహ్వరు? దేవేంద్రుఁ డెట్టింపు !
తన్నూరి యేరీతిఁ దనరుచుండు!


దేవేంద్రుఁ డిందుచేఁ ద్రిభువన సామ్రాజ్య
పట్టభద్రుఁడ నెడి ప్రణుతిఁంచే!
దేవలోకమునందు దేవ తాళికి నెట్టి
శీలవృత్తంబులు చెలఁగుచుండు

అమపరిపండు లేబాతి నసురు లైరి ?
పుణ్యజనులైరి? రాక్ష సమూ ర్తు లైరి
దేవ యోనులకును భారతీయులకును
శాంగేనేమైన యున్న దే? సంగరహిత?


అనిన యంత పౌరాణిక ప్రకాండుఁడు: ప్రహృష్టాంతరం గుండై మున్నొక యప్పుడు స్వానుభవంబున నెరిగిన సమాచారంబు సాంగంబుగా విన్పింతు వినుమనియిట్లు చెప్పదొడంగె


సూతమహర్షి స్వర్గలోక ప్రయాణము




దారు కానని నున్న 'తాపస శ్రేష్టుల
బొడఁగాంచ నొకనాఁడు బుద్ధిపుట్ట
యోగ బలంబుచే నుప్పొంగ్ నింగికి
గను జెప్ప పాటులోఁ జనఁగ నచట


5