పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణ ఘు


చీఁకటిగాంగ చెట్టుకడఁ జింపీరియకుల చాపమీదఁ బుం
స్కోకిల కాకలీధ్వనులు శ్రోత్రపుటంబుల విందుఁ గూర్పఁగా
వ్య్యాకులపాటు లేని హృదయమ్ము నమ్ముని కూరుచుండి నా
కైకనుదోయి త్రిప్ప సరిగా నుపవిష్టుఁడ నైమ వెంటనే.


"శేషధర్మమ్ములను వచించెన నటంచుఁ
జెప్పితిని నిన్న పుత్రకా ! చెప్పువోయి
నీ య్రెఉంగ వలసినట్టి నిఖిలమైన
ధర్మసూక్ష్మముల్ పెద్దలఁ దలఁచి యనిన.

పిమ్మట గురు గురుభక్తిని
నమ్ముని మూర్ధన్యునాస నౌథల నిడుచున్
బమ్మెరపాటును విడచి క్ర
మమ్మునఁ బల్కితిని నక్ష్యు మాణ విధమునస్,


కంఠముఁ జించుకొంచు సరిగా వినుచో నఱచేతిలోన వై
కుంఠముఁ జూపఁగాగలవు కోన్నిపురాణములంచుఁ జూల ను
త్కంఠతఁ గొందరావెదరు తథ్యము నా క్రైంపుమయ్య ని
ష్కంటా చరిత్ర ! మికు బుధకోటి గరాగరి చెప్పినట్లుగన్


నర్వసంగపరిత్యాగ సాధుమూర్తు
లైన మీకు మోమాటమీ యనుట లేదు
కాన దూరుపోగడ్తలన్ గణుతి సేయ
కున్నదున్నట్టుగాఁ జెప్పఁడో యతీంద్ర !


4