పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క థా ప్రొ రం భ ము


ప్రథమాశ్వాసంబును నే
గ్రథియించితి సూతమౌని కరుణారస దృ
క్పధగమనుఁడనై
యావలీ | కథావిధానంబుఁ బాఠ కా ! విను, వినుతున్.


అతుణోదయాత్పూర్వ మంబరంబున భార
త పతత్రి వేఁగు గీతములు పాడ
కలకలా రావ సంకలన సంకులముగా
గ్రుడ్లుపుట్టువు లెల్ల గూండ్లు వీడ
సౌగంధికాబ్జాత జాతసౌరభసిక్త
మందానిలంబబై మలసియాడ
పుండరీక శరారుతండంబు హాయిగా
గుర్రు పెట్టఁగ గొండ గుహలనీడ


నేగుజాముననే లేచి జాగు లేక
జాహ్నవీ తోయములయందు స్నానమాడి
జపముఁగావించి సూతర్షి సాధుమూర్తి
మరలి నాతోడఁ దనయాశ్రమంబు జేరి.

3