పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము

నాదారురై తుల కేదారభూములు
ఫలియించు నేనదీ వారిచేత
గంగానదీకల్ప గళితాఘయౌదేన
వేంగి దేశం బెల్ల వృద్ధిఁగాంచె



అట్టి గోదావరీ నదీ ప్రాంతభూమి
సలరుచుండు ద్రా క్షారామ మందు వేల సె
దెలుఁగువారింటి వేలుపీ దేవుఁడనఁగ
భీమనాథుండు వైరి దృగ్భీముఁడగుచు,

ఆపురీ దేవశర్మయను నట్టి మహాత్ముఁడు భూసురుండు వి
ద్యాపరిపూర్ణుఁడొకరుఁ డుదారుడు వాసముఁ జేయు వానికిన్
బాపలు లేని" పెద్ద వలవంత గుదింప యధోచితంబుగా
బాపలు మోద మొంద భయభక్తినొనర్చెయ నేక యజ్ఞముల్ ,



బుడుతఁ డొకఁడై న లేకున్నఁ బుట్టు గతులు
వాయు నా పితరులకు నివాప జలము
చుళుక మేనియు నిచ్చెడి చోప్పు లేదు "
పుణ్యమిటు పోకా లెనని లోఁ బోగులుచుండ


ఓ మెడు నోముపంటయన నొక్క కుమారుఁడు దేవశర్మకున్"
మోమునఁ దెల్విపార గృహము వికసింపఁగ సంభవించెఁ ద
ద్గ్రామ నిదాసు లెల్ల నుడికారముతో మన దేవశర్మకున్'
బూమేలపుట్టెనని పొంగి చెలంగీ మెలగుచుండఁగన్,



118