పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమా శ్వాసము


అని విని సూతమౌని క్షణ మర్ధనిమీలిత నేత్రపద్ముఁడై
యని యేనునన్ను జూచియనయంబు తెనుంగునమాటలాడుచున్
దెనుఁగుఁ బఠింపుచు దెనుఁగు దేశమునం బ్రభవించి యెవ్వఁడీ
తెనుఁగుఁ దెనుంగువారలను దిట్టునో నిష్కృతి లేదు వానికిన్..


మఱియు



అరణుఁ ద్రికాలవేదులయి నట్టి మునీశశిఖామణుల్ ధరా
మరులు పఠింపఁగూడదు సుమా! తెలుఁగంచును దొల్లి చెప్పిపో
రి యాలకింప డెవడేని పఠించినవాఁడు ఘోరమౌ
నిరయమునందు యాతసల నింపిరివందురు వేయి వర్షముల్


నిరయ మనుభవించి మరలి ఈమీదను
హీనజన్మమెత్తి యెడలి “యెడలి
మనుజుఁడగుచుఁ దుదకు మహీమీఁదఁ బుట్టును
వేదవాక్యమిదియు వినుము కుర్ర !


దీనికి దోర్కాణంబుగాఁ జిన్ని యుపొఖ్యానింబుఁ జెప్పెద నాకర్ణింపుము,


కబీరుదాసుని పూర్వజన్మ వృత్తాంతము.




సప్తఋష్యాశ్రమ స్థలి నంటి యే నది
పారుచుండెడు నేడు పాయలగుచు
దక్షిణాపథ మెల్లఁ దరియింప నేనది:
గోని తెచ్చి గౌతమ మునివిభుండు

117