పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము



అతి సుకుమార సౌరభ సమన్విత పేశల పుష్పమంజరీ
వితతినిగాంచి వెగలఫు వేడుకఁ బొందక తోటమాలి పం
డితపరుఁడైన బ్రాహ్మణుఁడునిక్కముకాదనిబై సిమాలి దు
ష్కృతమతిఁ ద్రోసిపుత్తునని రిత్తలువల్కెడు మూరుఁడుండు నే!


అనిన యనంతరంబు జ్ఞానతృస్ఃణా పీడ్య మానమానసుం డనై వ్క్ష్యమాణంబుగా సూతమునీంద్రుని బ్రశ్నించితిని



తెనుఁగును మ్లేచ్చభాషయని తిట్టి, శపించి,లిఖించి గ్రంథముల్
వినుకలి లేక రంయాంద్రులను మ్లేచ్చులటంచు దూరనాడు చున్
గనుకని వాదులాడెడిజనంబుల కెట్టిగతుల్ అభించునో
మునివారచెప్పఁడయ్యసయమున్ మనుమార్గముదప్పకుండఁగన్



కన్న తెల్గుబాస గాసటబీసట
మాకు సంస్కృతంబె మాతృభాష
యని మృషోక్తులాడు నవనీసురులుతెల్గు
భాస దెలిసి చదువ బాడియౌనె?


చదివిన దోషంబగునే!
చదువంగారాని చదువు సాహసవృత్తిన్
జదివిన వారికి నిష్కృతిత
పొదలునె యేమైననఁ జెప్పు పుణ్య చరిత్రా


116