పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


ఎరుగవే పర శ్శేయసహిష్ణు భావ
బంధురత నిట్టి గోముఖ వ్యాఘ్ర వితతి
పుట్టుచుండు నప్పుడపుడు భూమిమీఁద
నీతి పేరిటఁ బ్రజకు దుర్నీతిఁ గజప?


పరుల ప్రతిభఁ జూచి ప్రమఁజూచీ ప్రథఁజూచీ
కావ్య పటిమఁ జూచి కన్ను గట్టి
యంఘ్రీభవుని కావ్య మగ్రాహ్య మని గొణ్గె
సప్పకవివరుండు తప్పుమాట.



గోణిగెనుగానీ దొంగయయి గొణ్గిన 'వెంట నే రామరాజభూ
షణకవిసార్వభౌముని లసత్కృతినుండి గ్రహించే పద్యమున్
గణగణ మోగు గంటమును గైకొనీవ్రాయుటొకెత్తు, పిమ్మటన్
మీణుకక దాని నిల్పుకొని నెగ్గుటొకెత్తుగదా కుమారకా!"


ఇంతియేని నిజముగాఁ గృతులయందుఁ
గుటిలబుద్ధి పీడితుఁడౌచుఁ గులముఁ బట్టి ,
గ్రాహ్య, మగ్రాహ్య మనుచు నిర్ణయముఁ జేయు
వాని కెట్టి ప్రాయశ్చిత్తమైన లేదు.


పరిశీలించినఁ గావ్య రాణికి గుణ ప్రాశ స్త్యముం బట్టియే
గురుభావంబు పొనంగు, నేల కులముం గోత్రంబు లెక్కింప! ఓ
క్కకరుఁడై నన్ గవి భారతంబుబ లే నొక్కండైనఁ దిక్కన్న యు
త్తర రామాయణముంబఠించునో!'యీ తార్కారాణముంజాలదే!


115