పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


కన్న దానిని గురులచే విన్న దాని
నేను వచియించితిని గాదె యిప్పుడు నీకు
వ్యాస శౌనక సంవాద మైన కథను
దీరినే సంశయంబులు ? తేల్పుమన్న !


అరటి పండు విప్పి యఱచేత నిడినట్లు
తెల్పినపుడు నాకుఁ దెలియు కున్నె !
ధర్మశాస్త్రములును, దద్రహస్యములును
వేయుమాట లేల ! వినుతశీల,


పలుమరు విప్పి చెప్పితిరి వ్యాసుఁడు చెప్పిన పూర్వకాల ముం
గలిగిన కొన్ని ధర్మములు గౌరవ బుద్ధిని వింటిగాని యీ
కలియుగమందు మే మీపుడు కల్గిన హేతువుఁ బట్టి మిరలున్
గలియుగ ధర్మముల్ నుడూనన గాఁదగు సారెకు దేశి కేశ్వరా. \


నానిని నూతుఁ డిట్లనె, సనాతన ధర్మము లార్యధర్మముల్
గావున నెట్లు మార్వడును ? "కాలము కల్పము లేని మార్చఁగా
లేవు సనాతనంబయి' చలింపక సుస్థిర మాటచేతనే
యీ పసుధాస్థలిన్- వినుతి కె క్కెను వైదిక ధర్మ మెంతయున్.



అరసిచూడఁ గృతయుగంబ యైన ద్రేత
యైన నేమి? ద్వాపరయుగ మైన నేమి ?
కలియగయిన నేమి ? ధర్మ మొక్కటియ చుమ్ము
తారు మారగుచుండిన ధర్మమౌనె?

112