పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురా ణ ము


ధర్మబద్దము కాని చందమును జెప్ప
వేదసారంబుఁ దరచి చెప్పితిని దీని,
మల్లగుల్ల ము మానుమో మౌనిచంద్ర !
పిదపకాలంబు వచ్చుచున్నది మరింత,



సంతోషంబగు నిచ్చటన్ నిలున మీజన్ంబుకై కాని మా
కెంతే నీడ నిల్వరా దుదయ మంచే సేతు బంధంబునన్
నంతల్ దీరఁగఁ గ్రుంక గావలయుఁ గానన్బోదుమచ్చోట కం
చంతర్థానముఁ బొందే వ్యాసఋషిరాట్టాశ్చర్యధుర్యంబుగఁన్ .


దుర్వాసుం డబునిఁదనన్ను గనిసంతోషంబుతో వ్యాసుఁడున్
సర్వాంగీణముగాఁగఁ జెప్పి మము నిస్సందేహులం జేసె నిం
కర్వాచీనులు మోదమంద భవదీయాలాప మాలించుచున్
బూర్వాచారవిదగ్గులం దెలుపు సంపూ పబ్ధంబునన్.


ధరాధర్మములు నే
నిర్మలమతిఁ దెలిసికొనగ నిష్ఠురడితిన్
ధర్మం బిప్పుడు దెలిసితి .
సర్మిలి క్షమింవుమయ్య ! యాదరబుద్ధీన్ .


కథకుఁడవై మాకు మనో
రథములు "నేసఁదీరు విధము ప్రథితమనీషన్
వ్యధ లుడుగు విధముగా మధు
మధనుని కథఁ జెప్పుమనుచు మరిమరిపల్కెన్ ,

110