పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


జ్ఞానులమంచు లోఁదలఁచి గర్వపడంగను "మేలుగల్ల ద
జ్ఞానులఁ జూచి యేవపడఁ గార్యము కల్గదు జ్ఞానులెప్పు డ
జ్నానుల చెంతఁ జేరి యిదికాదిదియౌసని నచ్చజెప్పి సు.
జ్ఞానులఁ జేయుటే విధియ'కార్యమయౌను మంరొండుచేసినన్



గౌవున సజ్ఞలం బిలిచి కన్ముని నీతులు చెప్పమానీ పైఁ
గా వివరంబుగలిన యకండిపఁడేనియుఁ బజ్ఞం జేరనే " “
త్రోవనో సాఁకుఁ జెప్పి పెడ త్రోవలఁబెట్టి కలంచు టెల్ల దు
ర్భావము, సెప్ప నేల? యిది రాక్షస లక్షణమౌను శౌనకా!


ఇది భావించియే సూతునిం జిరుతనాఁడే చేరగాదీసి యీ
చదువుల్ చెప్పుచు ధర్మముల్ స్మృతిరహస్యంబుల్ శ్రుతిజ్ఞానమున్
విదితాచార విశేషముం దెలిపి ధీ విస్తారునిం జేసి యెప్పి
దముం జూపితి మెల్ల వారలకు సంప్రీతాంత రంగంబుతో,


అతని యవ్యాజ భ క్తిచే నలరి నాము. అ
తని శుశ్రూష చే మోద మందినాము
అర్హు డాతఁడు మీ సత్రయాగమందుఁ
గథకుఁ డౌటకు సర్రాట కల్గరాదు.


గీర్వాణభాషయం దం
తర్వాణులు మెచ్చుకొని నైపుణ్యముతో
సర్వము నాచేఁ దెలిసియు
గర్వింపఁడు చిత్తశుద్ధి: కలవా డగుటన్ ,


109