పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


అనుచు సాకూత సస్మితాససముతోడ
మర్మ భేదకముగ నామె మాటలాడ
ధారణీసురుఁడుర్రూతఁ దటమటించి
యావఁ ద్రావినట్లగుచు నిట్లాడెఁ దుదకు:



తల్లి యెలుంగకాడితిని, ధన్యవు, సై పుము నాదు తప్పు, నీ
యుల్లమునందుఁ జాల దయయుంచుము, దుర్ల భయోగదృష్టిచే
నెల్ల గ్రహీంచి మించితివి, యేగతి నీకది లభ్యమయ్యే! నీ
వల్ల, నెరుంగఁగోరెదను వానుకొనుమమ్మ యటంచు వేడినన్ ',


పతియే దైవమటంచునమ్మి కొలువన్ బ్రాప్తించెనీయోగమీ
వతికోపంబునఁ గొంగఁ జంపి యిటు భిక్షార్థంబుపై రాఁగ మ
త్పతి యే తేరఁగఁ బూజలన్ సలిపినీబైక్ష్యంబు గైకొంచు వ
చ్చితి రోషించితి సందుచేత నిది చెప్పంగదే ధర్మమున్ ?



ఎట్టి తపమొనరించిన నేమి ఫలము
బ్రాహ్మణత్వము నీకుఁ జే పడఁగ లేదు
వినుమిచటను ధర్మ వ్యాధుఁ డ నెడి బోయ
కలఁడు వానిచే ధర్మముల్ దెలిసికొనుము.


అనీనటి గౌశికుండు కటకటణ్బడి సన్ను , బాహ్మణోత్త ముని బోయకుశిష్యునిగాఁబంపెదద నేతల్లీ యని న నానతీ రత్న ము.


105