పుట:Snehageetalu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      ఎట్టివేదికందు ఏ ముహూర్తమునందు
      ఏనిమిత్తమలది నెదురుపడెనొ
      ఆత్మబంధు వనుట అక్షరసత్యంబు
      పెద్దివారు నాకు చద్దిమూట.

      హితులు, సన్నిహితులు, హిమశైల సన్నిభులు
      మదిని దలచబోరు మంచి తప్ప
      నాదు సుగతి దలచు నాదు ప్రగతి జూచు
      మనసు గలిగి యున్న మాతృసములు.

      కళల కాంతులన్న కలవరించు మనసు
      పొరుగు మేలుసేయ పొందు ముదము
      జ్ఞాన వీధులన్న మానసమ్మొప్పును
      అట్టి బుధుల కూర్మి గట్టి ఫలము

      కష్టమెంతో గొని నిఘంటువులను గూర్చె
      సూక్తులన్ని జేర్చి చూపె ప్రతిభ
      భాషపట్ల మోజు భావానురక్తియు
      తనదు శ్వాసలగుచు దనరుచుండె.

      శాశ్వతమగు స్నేహ సౌహార్ధ్రవాంఛతో
      కృతిని ఇచ్చుచుంటి హితవుగాను
      రామరత్నమ హరి రాఘవ రాములున్
      సాదరమ్మను ఎద మోద మలర.
                                            -రచయిత