పుట:Sinhagiri-Vachanamulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

29

గట్టవద్దు. ఓ మహాత్ములారా, మీవలన నడియెడు పర్వవిరక్తిం బొందఁగలిగెను. అడియేని జన్మంబు పునర్జన్మం బాయెను. మీదాస్యము నాకు దొరకెను. ఓ మహాత్ములారా, లెండు.' అని పొతకమూరి భాగవతులను కృష్ణమాచార్యులు లేవనెత్తి స్తోత్రము చేసెను. అంతట బొతకమూరి భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల సందర్శనము చేసి నిలుచుండి,వారి ముఖారవిందంబు బొడగని, తమలో తా మొండొరులఁ జూచికొని, పరమరహస్యముగా భాషించి, 'యితండే (యాతఁ) డౌ'ననియుఁ దప్పదనియు నిశ్చయించి, 'మనవలనంగదా యీతనిభోగములు వికల్పమైన'వని తమలో దాము నిశ్చయించి, 'మనము కృష్ణమాచార్యుల సేవింపవచ్చిన ఫలమింతకు వచ్చెఁగదా! ఇతని శృంగారవైభవములు మనవలన విఘ్నంబాయె'నని పొతకమూరి భాగవతులు తమ దవడలు తటతటఁ దాటించుకొని, యీ యపచారద్రోహము లెన్నడు తొలంగునో యని దుఃఖించుచుఁ, గృష్ణమాచార్యులతో సంభాషణలు సేయఁదొడంగిరి. 'ఓ మహాత్మా! ఇటువంటి వికల్పము నీవేటికి. నీవు మహాత్ముండవు. నీవు పదనొకండవ యవతారుండవై చాతుర్లక్షగ్రంథనామసంకీర్తనలతో వాక్పూజలు సేయగా గృష్ణమాచార్యులై యవతరించినావు' అనగా "నడియని భాగ్యవశమున నిచ్చటికి వేంచేసితిరి. కనుక నేను గృతార్థుండనైతిని. మీ రిచ్చట సింహాద్రినాథుని సన్నిధిని స్వామిని తాండవమాడించవలెను. మీ మహత్త్వము సింహాద్రి యప్పడు వినవలెను" అనినఁ బొతకమూరి భాగవతు లంజలిచేసి “యడియేల కధికారంబులేదు. మీ యానతిక్రమమున నటులే విన్నపము చేయుదు” మని, జగదీశ్వరునిపటము గట్టించి, శ్రీ యౌబళనాథుని సంకీర్తన వలన స్వామికి తాండవవినోదుండై, నాట్యప్రమోదుండైన శ్రీ యౌబళనాథునిఁ బొతకమూరి భాగవతులు తెరచాటునఁ దాండవ మాడించినప్పుడు కృష్ణమాచార్యులు భీతిఁ జెంది, “మిమ్ము నెఱుంగలేక మీతో సంభాషణచేసితిని. నేను మూడుఁడను. కఠినచిత్తుండను. ప్రహ్లాద నారదాదులైన పరమభాగవతులు మీతో సంభాషణ చేయవలె. నేను నరజంతుఁడను. సర్వాపరాధంబులు క్షమించు”డని పొతకమూరి భాగవతులకు కృష్ణమాచార్యు లంజలి చేసి,