పుట:Sinhagiri-Vachanamulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

సింహగిరి వచనములు

మోహము విడిచి, “వైష్ణవదాసులతోడి సరసజ్ఞత చాలించవలయును. ప్రాకృతపుచెలిమిని పరిహరించవలెను. సంసారము నిస్సారము. [1] 'తల మీసములు వపనక్రియ చేయించి, యాడుకట్టుకట్టి, యహంకారమమకారంబులు వీడి, యుత్తమసాత్త్వికంబుఁ గైకొనెదను. నరహరిదాసానుదాసులకు దాసుఁడను. తొత్తును. తొండఁడను. బంటును స్వామి శ్రీపాదసేవకుండ' నని కృష్ణమాచార్యులు దృఢచిత్తుండై, శుచిర్భూతుండు గావలెనని యెంచి యప్పుడు, పొతకమూరిభాగవతులను దోడ్కొనివచ్చి, 'యిదిగో కృష్ణమాచార్యుల ద్వార వాకిళ్ళు. ఇచట మీరు వేంచేసి కూర్చుండుడు. ఆ మహాత్ముం డీ సమయమున,సంధ్యానుష్ఠానజపతపాది నిత్యకర్మముల ననుసరించునో తెలిసి విన్నపము చేసెద' నని, పోవునట్లే పోయి, తా పెడద్వారంబున వెడలి, క్షవరకునిం బిలిపించుకొని, తల మీసములు బోడించుకొని, స్నాన మాచరించి, శిఖాయజ్ఞోపవీతములు ధరించి, కటిసూత్రమున కాషాయవస్త్ర మాడుగట్టుగా ధరియించి, లలాటంబున తిరుమణి తిరుచూర్ణములు ధరియించి, దండెయుఁ జిటితాళంబులు సంధించుకొని, సంకీర్తనవాక్పూజలు సేయునంతట, పొతకమూరి భాగవతులఁ బిలువనంప నవధరించిన సన్నిహిత కైంకర్యపరులు పోయి “పొతకమూరి మహాత్ములారా, కృష్ణమాచార్య సందర్శనము మీకు శీఘ్రమున దొరుకును. ఈవేళ వేంచేయుం' డని పిలిచిన సంతోషచిత్తులై యంతఃపురమునకు వేంచేసి కృష్ణమాచార్యుల తిరువడిగళ్ళు సేవించి యడియేని దాసులమని యాచార్యుని శ్రీపాదయుగళమునకు సాష్టాంగదండప్రణామములు సమర్పించిరి. తమ ఫాలప్రదేశమునఁ గృష్ణమాచార్యుల తిరువడిగ ళ్ళద్దుకొని, యో మహాత్మా, మా జన్మంబులు పునర్జన్మంబులుగా నీడేర్చితిరి. అడియేలకు జన్మపవిత్రం బాయేను. మీసేవ ప్రసాదించితిరి. మిమ్ముగనెడు భాగ్యము చేసితి'మని కృష్ణమాచార్యులఁ బొతకమూరి భాగవతులు స్తోత్రము చేయగా నపుడు కృష్ణమాచార్యు "లడియేని తొత్తును. తొండఁడను. జీలంబెడును. అపచారద్రవ్యము మూటఁ

  1. ఇచ్చట కొద్ది గ్రంథపాతము.