సింహగిరి వచములు
27
న్నారు. (ఆ) యాచార్యుని శ్రీ పాదసేవకుండ నేను. మీకా మహాత్ముని సందర్శనము శీఘ్రమే దొరికింతును. మీ మహత్త్వ మాతనితో నానతీయుఁడు. ఆ యాచార్యునకు నమ్మిన హితుండ. మీ రెచటనుండి వేంచేసితిరి? మీ యాచార్యులెవ్వరు? మీ దైవంబెవ్వరు? మీ నామధేయంబు లేవి? ఆనతీయుండు. ఆ మహాత్ముడున్న తావునకు పనివినియెదను. అప్పుడు పొతకమూరి భాగవతులన్వయించి (యిట్లనిరి.) 'పదునొకండవ యవతారుండగు కృష్ణమాచార్యుల సందర్శనము మాకేవేళ దొరకునో! మా పూర్వాచార్యుల నామములు విన్నపము సేయుదుము. ఓ మహాత్మా! వినుము. మా పూర్వాచార్యు లుత్తమసాత్త్వికులు. సప్తసాగరములకును, స్థావరజంగమాదులకును, సకలాచార్యులకును, పదునాల్గుభువనములకును, పదుగురాళ్వారులకును, పదముగ్గురు భాగవతులకును, పరమపదనివాసుని పరంజ్యోతియైన స్వామికి పట్టు, ప్రమాణస్వరూపజ్ఞాని తిరుమలాచార్యులు, మాకు పరమాచార్యులైన మహాత్ముండు. జన్మాదులు మగుడరాకుండను మంత్రోపదేశం బానతిచ్చిరి. ఆ యాచార్యులు పరమపదముఁ గనిరి. శ్రీ రామానుజుల శ్రీపాదసేవకులము, శ్రీయౌబళ నారసింహుని నాట్యవినోదులము. పొతకమూరి భాగవతులము. నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, లక్ష్మయ్య, శ్రీ చెన్నమయ్య, మా నామధేయములు. కృష్ణమాచార్యు లేకాదశావతారంబైన మహాత్ముఁడనంగాను, చాతుర్లక్ష గ్రంథస్వరూపుఁడనంగాను, నా యాచార్యుల సందర్శనము మాకు దొరకునో దొరకదోయని, శ్రీ యహోబిలమునుండి సింహాచలమున కేతెంచితిమి. అనినవిని కృష్ణమాచార్యులు సంతోషమున లెరగంది, 'యీ పొతకమూరి మహాత్ముల మహత్త్వము వినియుంటిమి. పటము పన్నించి, శ్రీ యహోబిలేశుని పటముచాటున నాట్యమాడింతురఁట. అట్లుగనుక, వీరి తిరువడిగళ్ళు సేవింపవలయునని యపేక్షించి యుంటిమి. నా భాగ్యవశంబున నిచ్చటికి వేంచేసిరి. కృతార్ధుండనైతిని. నా జన్మము సాఫల్యమాయెను. కాలము కడఁగంటిని. మా పరమాచార్యులైన పొతకమూరి మహాత్ములవలన విరక్తిని బొందవలయు' నని (యెంచి) యంతట వారకామినులమీది