పుట:Sinhagiri-Vachanamulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

సింహగిరి వచనములు

ప్రకారంబున నావాహనార్ఘ్యపాద్యాచమనస్నానవస్త్రోపవీతసుగంధపుష్పాక్షత ధూపదీప పరిమళ నైవేద్య తాంబూలాది షోడశోపచారముల నర్చన చేసి కంకణకేయూర కౌస్తుభాభరణాలంకృతునిగాఁ జేసి, మకరకుండల మణిమయకిరీటహార ఝణఝణాత్కార నూపురాది భూషితునింగా వామాంకస్థితకమల ముఖావలోకన కుతుహల తుష్టమానసునిగా ధ్యానం చేసి, ఓంనమో నారాయణాయేతి వాక్యములచేత వందనము చేయునతండు పరమభాగవతోత్తముఁడని శ్రుతివాక్యములు చెప్పెడుంగావున నట్టివానికి మీరు, మీకతండు దక్క నితరులు గలరె? కృపాంబుధీ. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

29

దేవా, మీయురంబున నిరవై వెలింగెడు శ్రీమహాలక్ష్మియు, కౌస్తుభమాణిక్యము, మీనాభి కమలమందున నవబ్రహ్మలు నింద్రాగ్నియమ నైరృతి వరుణ వాయు కుబేరేశానులైన యష్టదిక్పాలకులుసు, నష్టదిగ్గజంబులును, భుజంగంబులు, సప్తకులపర్వతంబులు, సప్తమహర్షులు, సప్తజలనిధులు, సప్తవాయువులు, ధరణియు, గగనంబును, దీపంబును, నురుములు మెరుములు, మేఘంబులు దివి భువి పాతాళ దేవదానవ లోకములయందున్న చరాచరాద్యఖిల జంతుజాలములు మీ నాభికమలోద్భూతునివలన లిఖితంబు గావే. శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

30

దేవా, ధాత్రి ఉదక మనలము, మారుత మాకాశము, జీవాత్మ, భూతాత్మ, యనియేడు భేదస్వరూపంబు లేక త్రిగుణానందమైన యిట్టి యాలయమై, జీవుండవై , దశప్రాణుండవై, దేహమునకు, మనసునకు మానసోల్లాస మైన మునిజననాథుల మనంబులఁ జేరుదువు, జిహ్వచాపలంబునకు మదన మాయాంధకారమునకు సుజ్ఞాన దీపమన నారాయణపదమ