పుట:Sinhagiri-Vachanamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

శ్రీమద్రామానుజులు - సిద్ధాంత పూర్వరంగం

ఆ తరవాత ఆశ్వారుల భక్తి ప్రపత్తులు అంతస్సారాలుగా బ్రహ్మసూత్రాలు శరీరంగా పాంచరాత్ర సిద్ధాంత పీఠిక మీద విశిష్టాద్వైత సిద్ధాంతమూర్తిని రూపొందించిన వారు శ్రీమద్రామానుజులు. ఉత్తరాన సంస్కారులూ విప్లావకులూ ఆయన సాత్వత భాగవతులకు వారసులీ దక్షిణాన అవతరించిన ఆళ్వారులు, అటుసాత్వత భాగవతుల లోని సంస్కార దృష్టినీ, విప్లావక బుద్ధినీ, భక్తినీ, భావావేశాన్ని ఆరాధనాతత్త్వాన్ని ఆకళించు కొన్నారు. శ్రీమద్రామానుజులు. అట్లాగే ఇటు ఆళ్వారుల్లో ఉన్న ఆర్తినీ, శ్రీమన్నాయణ పారమ్యాన్ని భక్తి మాధుర్యాన్ని సమతాదృష్టినీ సౌందర్యభావననూ సమాలోకనం చేసిన వారూను శ్రీమద్రామానుజులు. తమ కనులముందే ఆవేశభక్తి తో, వర్ణవ్యవస్థమీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగు బాటుతో బసవన్న వీరశైవ ప్రచారంలో జనసామాన్యం ఉఱ్ఱూతలూగటం చూస్తున్నవారాయన. జైన బౌద్ధాల ధాటికి తాళలేక మూలపడి మళ్ళీ బూజులు దులుపు కొనికర్మ కాండ యజ్ఞవాటికల్లో వేదికల్న లంక రించటం పరికిస్తున్నారా యన. ఇన్ని గందరగోళాల్లోనూ దృశ్యమాన ప్రపంచమంతా మిధ్యే అంటూ చివరకు గురు శిష్యసత్తా “మిధ్యాత్వాన్ని సిద్ధాంత మిధ్యాత్వాన్ని కూడా ప్రతిభా సింపచేసి"అకర్మణ్యత్వాన్ని పలాయనశీలాన్నీ ప్రబోధించే అద్వైత ధోరణుల్ని ఆయన అత్యంత శ్రద్ధతో పరిశీలిస్తూనే ఉన్నారు. ఇన్నిటిని అనుశీలించి చూస్తే 'మేధకూ హృదయానికీ,' జ్ఞానానికీ-భక్తికీ: సంప్రదాయానికీ- సంస్కరణకూ, వర్ణవ్యవస్థకూ= సమతా సౌభ్రాత్రాలకూ; అసత్యానికీ - సత్యానికి : బ్రహ్మండమైన సంఘర్షణ ఆయనకు గోచరించింది. వీటినన్నింటినీ అవిరోధంగా ఏకముఖంగా సమన్వయ పరిచే సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాలనే సంకల్పం ఆయనలో కలిగింది. ఇక్కడే శ్రీమద్రామానుజుల మహోన్నత వ్యక్తిత్వం మనకు గోచరిస్తుంది. ఈ మహత్తమ కార్యభారాన్ని నిర్వహించేందుకు తమజీవిత సర్వస్వం ఆయనత్యాగం చేసేరు. ఇందులో ఆయన తృషద్విధావిభక్తం. ఒకటి ప్రచారాత్మకం. రెండోది నిర్మాణాత్మకం.