పుట:Sinhagiri-Vachanamulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

17

మర్దనా. కౌస్తుభాభరణా. శరణాగతవజ్రపంజరా. యశోదానందవర్ధనా. పక్షీంద్రవరదా, ప్రహ్లాదవరదా. ధ్రువవరదా. అక్రూరవరదా. గజేంద్రవరదా. అంబరీషవరదా. ద్రౌపదిమానాభిరక్షకా. పాండవపక్షపాతీ. అక్షయసంపన్నా. విశాలపక్షా. పురందరవంద్యా, విదురునింటవిందా. ప్రణుత వాల్మీకి వరధ్యానా, అప్రమేయా. ఆదిమూర్తి. ఉరగశయనా, ఈషణత్రయ భువనత్రయ. భక్తి ముక్తి ఫలదాయకా. శ్రీ వైకుంఠనాయకా. శ్రీ రాఘవేశ్వరా. శ్రీకృష్ణకువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

24

దేవా, తొల్లి రత్నబేహారులు బావలు మఱఁదులు సముద్రతీరమునందుండిరి. అందు కొందఱు రుద్రభక్తులు. ఒక్కడే మీ దాసుఁడు. అతఁ డన్నోదక తాంబూల గంధానులేపన వస్త్రములు మీకు సమర్పణ సేయక తాను నొల్లండు. అధ్వానమందు విడువని వర్షముచేత నష్టదినంబులు మీ కోవెల లేకుండగాను ఉపవాసమే యుండెను. ఆ బావమఱఁదులు హాస్యము చేయఁదలఁచి, గుడారు కంబము తుండించి, యాతుండు కొంతదవ్వు కొనిపోయి యచట ప్రతిష్ఠ చేసి తిరుమణి తిరుచూర్ణములు పెట్టి, గంధ పుష్పధూప దీపము లిచ్చి, మీదాసునికడకు వచ్చి యష్టదినంబులనుండి యెట్లుపవాసమున్నా' వనినను. మీ దాసుండేమనుచున్నాఁడు—— ఈయధ్వానమందు పెరుమాళ్ళకోవెల లేకుండగాను నా కన్న పానాదులుగా 'వనెను. 'మే మొక పెరుమాళ్ళకోవెల చూచి వచ్చితి' మని తాము చేసిన గుడారుకంబముఁ జూపిన మీ దాసుండు చూచి, మీ భావ మెఱింగి యీతండె భావనారాయణుండని దండము సమర్పించెను. తళిగ వడ్డించెను. మీకు సమర్పించి తాను ప్రసాదపడ్డ వెనుకను నా బావమఱఁదు లేమనుచున్నారు.—— మేము గుడారుకంబము నాటి ప్రతిష్ఠ చేసి వచ్చితిమి. అది మీ పెరుమాళ్ళు కాదు. గుడారుకంబ మింతే యని హాస్యముచేసినను నాదాసుండు తత్తరపడక 'యాతఁడు భావనారాయణుఁడు, మీరు భావముచేసి నిలిపితిరి. మీరే తిరిగి తెచ్చిన నేను చక్రహస్తుండఁ గాక పోయెద' ననిన నా సమయమున రుద్రభక్తు లుప్పొంగి