Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

11

యహంబు గడచుట! అట్టి మీనజులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా, పాదమహాముని కొక్కపాదంబు విమృష్టం బగుట! ఆట్టి పాదమహామునులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా, మహాప్రళయంబగుట! అట్టిమహాప్రళయంబులు చనిన మీఁదటఁగదా, రుద్రుండు తాండవంబు నటియించుట! అట్టిరుద్రులు చనిన మీఁదట గదా, ఏకార్జవోదకమై వటపత్రశయనుండై కృష్ణ కృష్ణావతార లీలలం జీఁకటియౌనఁట! అట్టి చీఁకటిచనిన మీఁదటగదా, యష్టభుజ నారాయణావతార మనంతకోటి రవి ప్రకాశమై వెలుంగు చుండునఁట! అట్టి యాదిదేవుండవు నీవఁట! అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

13

దేవా, (నిన్ను) నెఱుంగని వాని వ్రతోపవాస వర్ణాచారములు విఫలములు. జ్ఞానరహితుండైన నరుండు దా కర్మియైన నేమి ఫలము? మా సింహగిరి నరహరి నెఱుంగని వారి జ్ఞాన మజ్ఞానమగును. ఎఱుకచే మరపుచే మీ మూర్తి ధ్యానవిశేషంబునకు సోపానంబులు. ప్రథమ మన్యదేవతానిరసనము. ద్వితీయము విషయరాహిత్యము. తృతీయము భగవద్దాసుల కైంకర్యము. చతుర్థము మీ మీఁది విశ్వాసము. పంచమము సత్యము. షష్ఠ మాశానిర్ముక్తి. సప్తమము రహస్యము. పరమాణువు రాఘవభాష్య భావవిశేష సుధామృత సంజీవ నిష్ఠ పరమ విభూతి విశ్వమై జయాధికారంబు గలిగి, 'యహింసా పరమోధర్మ' యనెడు నర్థంబు దెలసి, సర్వజీవ దయాపరుండై, చిత్తములోని జీవుండు చక్రాంకితుండై (యుండ వలయు), వ్రతోపవాసంబులు సేసిన నేమి? షోడశ మహాదానంబులు సేసిన నేమి? దేహత్రయ గుణంబులు వదలక కులాభిమాన విద్యాగర్వంబులు కుదురుకొనక, యింద్రియ మోహాంధకారంబు నివారించకయున్న దేహి దుర్మతి. ద్వయము బ్రహ్మజ్ఞానమూర్తిలోను, మా సింహగిరి నరహరి పదధ్యానమందును దొరకును. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.