పుట:Sinhagiri-Vachanamulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ఇల్లూ యీ సాంప్రదాయికులూ ఇందులో ప్రవేశించటంతో దీనికి సంఖ్యాబలం తోపాటు సిద్ధాంతాల్లో అనేకానైన కలగలుపులూ ఏర్పడ్డాయి. ఈ సమ్మిత్రణంలోనే సిద్ధాంత, పూజా విధాన ప్రతిపాచకంగా 'పాంచరాత్రం' ఆవిర్భవించింది. ఈ విధంగా సోత్వత భాగవత పాంచరాత్ర శబ్దాలు వైష్ణవ పర్యాయాలుగా తత్సంప్రదాయానుయాయివర్గవాచకాలుగా ఏర్పడ్డాయి.

భాగవతం - వైదికీకరణం.

వర్ణవ్యవస్థమీదా, కర్మకాండ మీదా తిరుగుబాటు చేసి సాంఘికసూత్రాలు ప్రధానంగా వున్న జైన బౌద్దమతాలవారు ప్రజల్లోకి చొచ్చుకపోయి విపరీతంగా తమతమ ప్రచారం చేసుకొంటున్న ఆరోజుల్లో, వార్ని నిలవరించటానికి కఠోరనియమాలతోడి కార్మకాండల్తో కూడిన పూర్వమీమాంస కానీ, కేవలం మేధాశక్తి తో గారడీలు చేయించే “అద్వైతం కాని ఆక్కరకు రాలేదు. ప్రజా సామాన్యాన్ని నిల వరించి తమ వేపు తిప్పుకోవటానికి ప్రజా సాహిత్యంలోనే ప్రచారంలో ఉన్న సొత్వత-భాగవతమతాన్ని పాంచరాత్ర సిద్దాంతాన్ని తామూ అంగీకరించి అందులో ప్రవేశించి తద్వారా అవై దికాలైన జైన బౌద్దాల ప్రవాహ వేగాన్ని అడ్డుకొన్నారు వైదికులు. ఇట్లా విప్లావకమైన సోత్వత భాగవతమఠం శ్రీ వైష్ణవమూ వైదికమూ కూడా అయింది. ఐనా వైదికుల్లో వీరిమీద కన్నెఱ్ఱ పోనేలేదు. అవసరానికి వీరితో చేతులు కలిపినా తమ ఆభిజాత్యం అడుగడుగునా వీరికి గుర్తు వస్తు నే ఉంది. దీనితో ఇందులోనే ఉండి. దీన్ని తమకు అనుకూలంగా వాస్తవానికి దూరంకా కుండా మలచుకొనేవారు కోందరూ విడిపోయీ, దూరంగానే ఉండే, దీన్ని విమర్శించే వారు కోందరూ తయారయేరు. శ్రీ శంకరాచార్యుల వారి నాటికి ఈ విమర్శ పాంచరాత్ర ప్రామాణ్యాన్ని శంకిం చేవరకూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో భగవద్యామునమునులు అటుసాత్వత భాగవతుల్ని, ఇటువైదిక బ్రాహ్మణుల్ని శ్రీ వైష్ణవసాధార ణీకరణంతో ఏకంచేసి పాంచరాత్రాగ మప్రామాణ్య పరిరక్షణంకోసం పాటు పడ్డారు. పాంచరాత్రాగమానికి ఇతర తంత్రవై లక్షణ్యాన్ని వైదిక తనీ ప్రతిష్టాపించి శ్రీవైష్ణవ "విశిష్టాద్వైత (సంప్రదాయ.) సిద్దాంత పూర్వరంగ భూమికను ఏర్పరిచేరాయన,