పుట:Sinhagiri-Vachanamulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

సింహగిరి వచనములు

దేవా, ఏడువేలు పాపంబులు సేసి మతచోరుండై జన్మించును. దేవా, ఎనిమిదివేలు పాపంబులు సేసి నట్టడవిలో చాఱపులియై జన్మించును. దేవా, తొమ్మిదివేలు పాపంబులు సేసి చోరుండై జన్మించి తలగొట్టఁబడును. దేవా, పదివేలు పాపంబులు సేసి పంచాంగము చెప్పెడు బ్రాహ్మణుండై జన్మించును. దేవా, పదునొకండువేలు పాపంబులు సేసి గురుద్రోహియై యంధుఁడై జన్మించును. దేవా, పండ్రెండువేలు పుణ్యంబులు సేసి శ్రీమద్భాగవతులై, శ్రీవైష్ణవులై జన్మింతురు. దేవా, ఇది కృష్ణమాచార్యులు చెప్పిన సంకీర్తనఫలంబు. ఇందుకుఁ దప్పదు. మాయతి రామానుజముని వరము. అనాథపతీ, స్వామి సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ.

దేవా, మధ్యాహ్నకాలంబున జన్మించిన మనుజుండు కడుదుష్టుండై జన్మించును. దేవా, అస్తమానంబున జన్మించిన మనుజుండు క్షీణాయుష్కుం డగును. దేవా, తదుత్తరంబున జన్మించిన మనుజుండు సూతంపురోగి యగును. దేవా, ఆపిండంబును నొక్కొక్క పాపం బొక్కొక్క వ్యాధిగా సంక్రమించును. దేవా, పూర్వజన్మంబున గృహముల కగ్ని సంధించిన మనుజుండు వెనుకటి జన్మంబున కుష్ఠరోగియై జన్మించును. దేవా, జననీజనకులకన్నం బిడని మనుజుండు వెనకటి జన్మంబున గూబయై జన్మించును. దేవా, ఘనముగా గోవుల సంపాదించి వానికి మేపులు, నీళ్ళను పరామర్శింపకయున్న మనుజుండు వెనుకటి జన్మంబున పిరంగి వ్యాధివాఁడై జన్మించును. దేవా, ఘనమైన రొక్కంబు సంపాదించి తాను భుజింపక యొక్కరికి దానధర్మంబు, పరోపకారము సేయకుండినయతండు చచ్చి బ్రహ్మరాక్షసియై యాధనంబునకు కావలికాయుచుండును. దేవా, కూపంబుల పడవేసిన మనుజుండు వెనుకటి జన్మంబున భూతమై జన్మించును. దేవా, చాడిచెప్పిన మనుజుండు వెనుకటి జన్మంబున దానభ్రష్టుండగును. దేవా, తగవున కూర్చుండి పక్షపాతము లాడిన మనుజుండు వెనుకటి జన్మంబున బల్లియై జన్మించును. దేవా,