54
ఆరోజుల్లో అందునా వ్యావహారిక శైలిలో ఉన్న వచనాల్లో ఉండటం అబ్బురమేంకాదు.
పరిష్కరణం . పరిష్కరణీయాలు
డా|| కులశేఖరరావుగారు వచనాల వ్యావహారిక స్వరూపాన్ని గ్రాంధికీకరించటంతో పాటు అనన్వితాలూ అపపాఠాలూ అని తాముభావించిన వాట్నీ చాలా ఓపికతో సావధానంగా పరిష్కరించేరు. ఇందుకు వారెంతేనా అభినందనీయులు. అయినా పరిష్కరణీయాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఈ ముద్రణంలో మరి కొంత పరిష్కరణం సంప్రదాయాను గుణంగా నేను చేసేను.
మచ్చుకు కొన్ని:- 57వ వచనంలో.
“కుముద కుమూఢాక్షులు(?)ను" అని ఉంది. ఇక్కడ “కుముద కుముదాక్షులు" అని ఉండాలి.
30వ వచనంలో
“ఆ సింహాద్రి జగదీశ్వరుండంగ రంగ వైభోగదాయకుండు శ్రీరంగశాయి శ్రీ పరమపదవాసుండు శ్రీ జగన్నాధుండు సింహాద్రి యప్పుడుఁని వసించు తిరుపట్టణమందు" అని ఉంది. ఇక్కడ వాక్యాన్వయం ఎలా కుదిరిందో తెలీదు. సింహాద్రియప్పుడు కాదు “సింహాద్రియప్పడు" అని ఉండాలి. సింహాద్రినాధుడికి అప్ప అప్పర్ (రు) అప్పడు మొదలైన పేర్లు ఉన్నాయి. కృష్ణమాచార్యులు కూడా ఇదే వచనంలో మరోచోట పొతకమూరి భాగవతులతో మీ మహత్వము సింహాద్రియప్పడు వినవలెను' అంటారు.ఈ అంతరంగ సాక్ష్యం వినకపోవటం వల్లనే ఎక్కడో వేంకటాచల విహారశతక పద్యపాదం ఉదాహరించేరు. విమర్శకులు కృష్ణమాచార్యుల సింహగిరినరహరి అప్పన్నే అనటానికి. ఇక్కడే మరో విషయం కూడా గమనించాల్సింది ఉంది. పొతకమూరి భాగవతుల్ని పరిమాఆచార్యులవారు