పుట:Sinhagiri-Vachanamulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

"ఆచార్యుడనెడి హనుమంతుఁబంపి •
“మీదాసులకాచార్య కటాక్షము లేకుండుటయే హాని
పరమాచార్యులం బోలు మఱి యాచార్యులు లేరు.
“నీవేమాయాచార్యుడవనిదండము సమర్పించి కడకుజనిరి.
“సదాచార్యకటాక్షేణ భజసిద్ధిం." ఆచార్యులేనరహరి
ఆచార్యకృపకు చేరనీయక
“నీవుత్తమ సాత్వికుండవు. సకలాచార్యుండవు"
“పరమాచార్య కృపచేర నేర్పు లేక
ఆచార్య శేషము దొరుకక"
“మీ యాచార్యులెవ్వరు"
“మాకు పరమాచార్యులైన మహాత్ముండు
మీకు మాపరమాచార్యులై యన్నియు దెలిపితిరి
“మాకాచార్యాపజారంబులేల మోపుగట్టెదవు.
"ఆచార్య కరుణా విశేషంబువలన,
“ఆచార్య కృపాకటాక్షమువలన
"అభ్యసింపరానివి రెండు–ఆచార్య కటాక్షంబోకటి ...."
"ఆ మీదట నాచార్యులకృపచేరుట"

ఈ ఆచార్య శబ్దం శ్రీ మద్రామానుజులకే వాచకం ఈయన దృష్టిలో. సొమాన్యంగా గురువుల్ని ఆచార్యులనీ, వారీగురువుల్ని పరమాచార్యులనీ వ్యవహరించటం కద్దు. కానీ కృష్ణమచార్యులు ఆచార్యుల్ని పరమాచార్యులంటారు. ఇందులో ఒక చమత్కారం ఉంది, “తస్మిన్ రామానుజార్యేగురురితి పదంభాతి నాన్యత్ర" అన్నట్లుగా పరములై న--- శ్రేష్ఠులైన ఆచార్యులు అంటే శ్రీ మద్రామానుజులే అని భావించినవారాయన. ఇదే భావంతో " పరమాచార్యులంబోలు మఱియాచార్యులు లేరు. పరమ బాగవతులం బోలు మఱి భాగవతులు లేరు" అంటారు. ఇట్లా పరమాచార్యులతో స్వాచార్యులకు అభేదాధ్యవసాయం ఘటించి స్వాచార్యులు రామనుజులవంటి వారనటం మరో విశేషం. పోతకమూరి భాగవతులతోడి ప్రసంగంలో మీ "దర్పోద గ్ర దశానవేంద్రియ... హనుమత్సమాన గురుణా"... వేదాంత దేశికులు