పుట:Sinhagiri-Vachanamulu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

1) "సంధ్యాది నిత్యకర్మానుష్ఠానంబులు దప్పక నడిపిననేమి
చతుర్వేద షట్ శాస్త్రముల్ సదివిననేమీ
శతక్రతువులాచరించిననేమి
సకల ధర్మంబులు నేసిననేమి
మా సింహగిరినరహరిదాసులకు దాసులైనంగాని లేదుగతి"

2)

“మీ కైంకర్యపరులకు వందనము చేయుటయే పదివేలు."

3)

“మీ నామావళినుచ్చరించు భాగవతులు ధన్యాత్ములు"

4)

“పురుష సూక్తంబున అభిషేకంబులుచేసి మిమ్ము గానలేరు.
పురాణంబులు శాస్త్రంబులు చదివిననేమి
మీ గుణంబులు తెలియక మీ దాసుండుగాక
మిమ్ముగనలేడు"

5)

“మీ దాసుల కెవరికైననేమీ తిరుకళ్యాణము చేసిన
వారలకనంతములైన పుణ్యములు కలుగునయ్యా"

ఆచారులవారి ఆంతర్యం

మతాంతర-మంత్రాంతర- సాధనాంతర-దైవతాంతర ప్రయోజనాంతరాలని పరిత్యజించా లంటారు ఆచార్యులవారు. శ్రీమద్రామానుజ సిద్ధాంతం లాంటి సిద్ధాంతంలేదు. రహస్య త్రయంలాంటి మంత్ర(త్రయ)ం లేదు. ఆచార్యకటాక్షంకంటే మరోసాధనంలేదు. సింహగిరి నరహరిని మించి దైవంలేడు, శ్రీ వైకుంఠంకంటే మరో ప్రయోజనంలేదు. ఇవి కృష్ణమా చార్యులసుదృఢభావాలు.

మత సహనం

(శ్రీవిష్ణుపారమ్యాన్నీ శ్రీ రామానుజ సిద్ధాంతాన్ని ఎంత అభినివేశంతో అనుసరించినా ఆదర్శప్రాయమైన మతసహనం ఆయనలో గోచరిస్తుంది--