పుట:Sinhagiri-Vachanamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

2. పౌరాణిక వచనాలు. సృష్టి ప్రళయాదులైన వివిధ పురాణాంతర్గత విషయాలు వర్ణించి పర్యవసానంగా శ్రీమన్నారాయణ పారమ్యాన్ని ప్రతిపాదించటం వీటి ప్రయోజనం.

3. ధార్మికవచనాలు. ధర్మశాస్త్రాల్లో, గరుడపురాణాదుల్లో ఉండే జన్మాంతర కారణాలైన దానధర్మాల, పాపపుణ్యాల పరిగణనం చేస్తూ తదపేక్షయా శ్రీవైష్ణవపారమ్య ప్రతిపాదనం చెయ్యటం, సంకీర్తన మహిమాభివర్ణనం చెయ్యటం వీటి స్వభావం.

4. కథావచనాలు. ప్రావాహికాలూ, ప్రాదేశికాలూ, పారంపరీరాలూ, పౌరాణికాలూ అయిన శ్రీవైష్ణవభక్తుల కథలని చెప్పేవి. విష్ణు భక్తి మహత్వ ప్రతిపాదన ప్రవణాలూ శ్రీ వైష్ణవ పారమ్య ప్రతిపాదన వరాలను ఇవి.

5. జీవిత వచనాలు. రచయిత జన్మవృత్తా దికాన్ని తత్తద్విశేషాలనీ సూచించేవి యివి.

6.సంప్రదాయ వచనాలు. శ్రుతి - స్మృతి ఇతిహాస- పురాణ ప్రమాణ వాక్యాలతో శ్రీమన్నారాయణుని స్వరూప రూప-గుణ విభవ ప్రతిపాధనం చేస్తూ విశిష్టాద్వ్యైత పద్దతిలో శ్రీమద్రామానుజ దర్శనానుగుణంగా సంస్కృత వేదాంత సంప్రదాయ ప్రతిపాదకాలు కొన్ని:

దివ్యప్రబంధ సంప్రాదాయ ధోరణిలో రహస్యత్రయాది ప్రశంసా పూర్వకంగా, ఆచార్య శేష - శ్రీపాద శీర్థ మహిమాభివ్యంజకంగా శ్రీవైష్ణవులకు శిరోధార్యాలు ఆచార్యుల వారికి అధ్వాక్కాలికాలూ శ్రీ వైష్ణవ సంప్రదాయ మణిమంజూ షాంతర్ని క్షిప్తాలూ అయిన శ్రీ వచనభూషణాది సంప్రదాయ గ్రంథాల్లో నిక్షిప్తాలైన పారంపరీణ భాగవతసంప్రదాయ రహస్య విశేషాలను ప్రతిపాదిస్తూ ద్రావిడ వేదాంత సంప్రదాయ ప్రతిపాదకాలు కొన్ని: ఇట్లా శ్రీ వైష్ణవంలో ఉభయ వేదాంత ప్రతిపాదకాలు ఈ వచనాలు,