పుట:Sinhagiri-Vachanamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

పత్రికలు వేయించటంలో, కవితలో, మతంలో దేశితనాన్ని ఆశ్రయించటంలో, శ్రీవైష్ణవ పారమ్య ప్రకటనంలో, సంకీర్తన సంప్రదాయంలో, ఇందూ అందూ ఏమిటి అన్నిటా తాళ్ళపాకవారికి కృష్ణమాచార్యులు ఆచార్యులే.

కృష్ణమాచార్యులకు వారసులు తాళ్ళపాకవారు

మతంలో దేశితనం అంటే_భాగవతమతం ఉత్తరాన ఉద్భవించటం లోనే స్వతంత్రత, విప్లాపకత, సమత, సౌందర్యం, ఆర్తి, ఆరాధన, మొదలైన భావాలతో దేశితనంతో తేజరిల్లింది. ఆళ్వారులు దక్షిణాన్న కూడా దానికి వారసులుగా ఇన్ని లక్షణాలూ దేశిదృక్పధంతో సంతరించుకొని తమిళంలో పాశురాలు పాడేరు. ఇది విరోధ దృష్టితోనో విద్వేషదృష్టితోనో సంస్కృతంమీదా తత్సంస్కృతిమీదా చేసిన విప్లవంకాదు. మతసంస్కృ తుల్ని దేశీయూలుగా సంతరించుకోవాలనే దేశిభావనతోడి తపన ఇక్కడ మనం గమనించాల్సింది. అటు వీరశైవంలోనూ ఈ లక్షణాలు కనబడు తున్నాయి. సంస్కృతం తత్సంస్కృతీ అగ్రవర్ణాలవారి, మేధావివర్గవారి కంచుకోటల్లోనే ఉండిపోవటంవల్లా విప్లావకమూ భక్తి భావభూమికా ప్రాదుర్భూతమూ, సర్వసాధారణీకరణ లక్షణ సమన్వితమూ అయిన ఈ విలక్షణ సంప్రదాయం, సంస్కృతీ, వాజ్మయం, దేశీయతాముద్రతో సామాన్య ప్రజానీకంలోకి చొచ్చుకుపోవటానికి ఈ దేశిమార్గానుసరణం ఆవశ్యకర్తవ్యం అయింది. కర్తవ్యం మాత్రమే కాదు దానిలక్ష్యం కూడా అదే. కృష్ణమాచార్యులు ఆళ్వారుల్ని, శ్రీమద్రామానుజుల్ని, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించటంలో కూడా ఈ దృక్పధమే కనబడుతుంది. భాగవత సంప్రదాయానుసరణంలో ఆళ్వారులు ఎల్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి నవలంబించేరో, ఆళ్వారుల్ని శ్రీమద్రామానుజుల్ని అనుసరించటంలోనూ కృష్ణమాచార్యులు అట్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి నే అలంబించేరు. ఆళ్వారుల వల్ల తమిళభాష వకుళా మోదవాసితం అయినట్లే కృష్ణమాచార్యులవల్ల తెలుగుభాష చాంపేయ సుమపరీమళ సంభవితం కావలసింది, ఆ పరీమళాల్నా స్వాదించటానికాంధ్రులింకా నోచుకోలేదు. ( లాగున్నది) -- ఆంచేత శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అనూచానంగా వస్తున్న ఈ స్వాతంత్య్రాన్నీ