పుట:Sinhagiri-Vachanamulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

చార్య వచనాలు యధాతథంగా ఇందులో కలిసేయి. చివరిమకుటం మాత్రం సింహగిరి నరహరికి బదులు శ్రీ వేంక టేశ్వరా అని ఉంది.ఇవి చాలా మట్టుకు "విష్ణు నామ సంకీర్త నఫలం"లో పాఠ భేదాలతో ఉన్నవే. మఱికొన్ని కృష్ణమాచార్యులవేమో అనిపించే ధోరణిలో నడిచినాయి. ముద్రా భేదంతో విష్ణునామసంకీర్త నఫలం వచనాలతో ఇందులో కొన్ని యధా తథంగా సంవదించటంవల్లా, కడమవి. వీటితో సహపఠితాలు కావటంతో పాటు కృష్ణమాచార్య వాజ్మయధర్ములు కావటంవల్లా ఇందులోనూ సింహగిరి నరహరి వచనాలు రూపాంతరితాలై ఉన్నాయేమో అని అనుమానించవలసి ఉంది. అటు తాళ్ళపాకవారి వచనాలతో, దొరకిన సింహగిరి వచనాలతోనూ జాగ్రత్త గా వీట్నిపోల్చి వాస్తవంగా అందులో సింహగిరి నరహరి వచనాలెన్ని ఉన్నాయో ఉద్ధరించి చూపాలి. మొత్తానికి తెలుగులో కనీసం శ్రీవైష్ణవ పరంగా వచ్చిన వచనాలు, విన్న పాలు అన్నీ కృష్ణమాచార్య ప్రభావవిలసితాలే అనటంలో సందేహం లేదు. వేంకటేశ్వర విన్నపాలు, వచనాలు, శఠకోప విన్నపాలు, రామానుజ విన్నపాలు, యతిశేఖర విన్నపాలు ఇట్లా స్తు తీవచన కావ్యాలు చాలా వచ్చేయి. వీటన్నిటా కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

ఆంద్ర మహాకవులమీద కృష్ణమాచార్యుల ప్రభావం

ప్రస్తుతానికి మనకు తెలిసినంతవరకూ కృష్ణమాచార్యులచే ప్రభావితుడైన మొదటి తెలుగు మహాకవి పోతనామాత్యులు కావచ్చును. కృష్ణమాచార్యులవలెనే పోతనగారూ విష్ణు భక్తులు. ఆచార్యులవారి భక్తిలా ఉన్మస్తకం కాకపోయినా పోతన్న గారిదీ పారవశ్యభక్తే. కాకతీయుల రాజ ధాని ఓరుగంటిలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కృష్ణమాచార్యుల మహత్వమూ, ఆయన సంకీర్తనవచనాలూ జనం నోట వినిఉంటారు పోతన్నగారు. ఆయన దశమస్కంద వచన భాగాలు కృష్ణమాచార్య వచన లక్షణ ప్రతిఫలకాలుగా కనిపిప్తాయి. సామాన్యంగా కృష్ణమాచార్యులు ప్రతివచ