Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో నివసించే తిరుమల బుక్కపట్టణం వంశ్యుడైన, (బహుళ) శఠకోపాఖ్యులైన తమ ఆచార్యులను ప్రశంసిస్తూ ఆయన చేసిన విన్నపాలివి. మన కృష్ణమాచార్యులకు చాలా అర్వాక్కాలికుడా యనఅని ఆ విన్నపాలే అంతరంగ సాక్ష్యం పలుకు తున్నాయి. ఇది 102 విన్నపాలు ముద్రితాలుకూడాను. శ్రీకాకుళంలో తమ ఆచార్యుల పరివారం లోని కొందర్ని ఈయన పేర్కొన్నాడు. దీనివల్ల కొన్ని చారిత్ర కాంశాలు తెలుస్తాయి. ఈయన పేర్కొన్న కొన్ని “సత్సంప్రదాయ" విషయాల వల్ల కూడా సంప్రదాయ చరిత్ర కోంత తెలుస్తుంది. ఈ విన్నపాలలో కృష్ణమాచార్యుల ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. ఈ శఠకోపవిన్నపాలరచయిత ఒక కృష్ణమాచార్యులు కావటంతో, మొదటి (అసమగ్ర) శఠకోప విన్నపాలు అజ్ఞాత కర్తృకాలు కావటంతో, అవీ కృష్ణమాచార్య ప్రణీరాలనే అనుమానానికి వచ్చి శఠకోప సన్ని కర్షతో కృష్ణమాచార్యుల తెనుగువేదం సహాపఠితం కావటంతో శఠకోపముని తమిళ వేదాన్ని కృష్ణమాచార్యులు తెనుగు చేసేరనే భ్రాంతికి పలువురు వచ్చేరు. కాని అది సరికాదు. కృష్ణమాచార్యుల ప్రభావంతో తెలుగులో వచ్చిన రచనలు అవి. వాటి కర్తృత్వంతో కృష్ణమాచార్యుల కెలాంటి సంబంధమూ లేదు.

ప్రచ్ఛన్న సింహగిరి వచనాలు

కృష్ణమాచార్య వాజ్మయం మహత్తరం, బృహత్తరం కావటంవల్ల ఆయన వచనాలు ఏ ఒక్కరూ సమగ్రంగా వ్రాసుకోవటం సాధ్యంకాదు. అంచెత ఎవరికి లభించినంత వఱకూ, శక్తి చాలినంత వఱకూ, వారు వ్రాసుకొని ఉంటారు. ఇవి వ్యావహారిక శైలీవిలసితాలూ, ఛందో బంధ విరహితాలూ కావటంవల్ల రానురాను కొన్ని చేర్పులు మార్పులు కూడా కొందరు చేస్తూ వచ్చి ఉంటారు. దీనివల్ల కృష్ణమాచార్య వచనాలు కొన్ని మరుగున పడిపోవటం, మరికొన్ని రూపాంతరితాలై ఇతర కర్తృకాలుగా ప్రచారంలోకి రావటం జరిగింది. ఈ దుర్గతిదేశివాజ్మయానికి మోదటి నుంచి వున్నదే: మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో "వేంకటేశ్వర మహత్వము"