పుట:Sinhagiri-Vachanamulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

నమ్మాళ్వారుల సంబంధం గలిగి ఆయనలాంటివాడే అయినవారు వణ్ శ్ఠకోపయతి అని సారస్యం. శ్రీవైష్ణవ భాగవతులందరూ తాము ఆళ్వారుల సంబంధుల మని చెప్పుకొంటారు. ఆ సంబంధంలోనే ఉంది వారి ఘనత. వణ్ శఠకోపయతి కూడా ఆళ్వారుల సంబంధం కలవారు అని యిక్కడిధ్వని. అయితే ఇంకా వేదంబు తెనుగు గావించిన అన్నప్పుడు 'మూలాధారా' ప్రశ్న అలాగే ఉంటుంది. మన విమర్శకులకు. సంస్కృత వేదమే తెనుగు గావించిన అని సమాధానం యిక్కడ. ఈ తెనుగు గావించిటంకూడా “నమ్మాళ్వారుల ' వేదంతమిళ్ శెయ్ ద' లాంటిదే. దీని సంగతి యింతకు ముందే విన్నవించేను. ఈ సంప్రదాయం తెలిస్తే కాని యీ అన్వయం నిర్వహించటం కుదరదు. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారు. క్యాటలాగులో శఠకోపవిన్నపాలకు సూచిక వ్రాస్తూ తమిళానికిది అనువాదమనే భ్రాంతిని ప్రకటించు కొన్నారు. ఆ భ్రాంతి విలసిత వాక్యాలే పై దురన్వయానికి మన విమర్శకుల్ని పోత్సహించేయి. ఇక పోతే శఠకోప విన్న పాలను గురించి.

శఠకోప విన్నపాలు తెలుగు వేదం కాదు

మద్రాసులో ఉన్న శఠకోప విన్నపములు రెండురకాలు.ఒకటి సమగ్రం. రెండోది అసమగ్రం. అసమగ్రప్రతినే తమిళానువాదంగా భాంఢాగారంవారూ,వార్నను సరించి విమర్శకులూ భావించారు. ఇందులో ఉన్నది ఒక్క వచనమే. మిగిలినవి మరిదొరక లేదు. తమిళానికి దిఅనువాదం అన్న ఊహ శఠకోప విన్నపములు' అన్న పేరు వల్ల వీరికి వచ్చింది. మరో 'శఠకోప విన్నపాలు'న్నాయి. ఇవి సమగ్రం. నామసామ్యం రెండింటికి ఉంది. ఆవీ తమిళానికి అనువాదంకావు. మరి యీ అసమగ్రప్రతిలోని కేవల విష్ణు ప్రశంసాత్మకమైన ఒక్క వచనాన్ని పట్టుకొని 'చూడని తమిళాని' కిది. అనువాదమని ఎల్లా ఊహించేరో ఊహకందనిది. అసమగ్రమై "నమోనమోలక్ష్మీ వల్లభా" అని (మకుటం) చివరకల శఠకోప విన్నపాలు (అందులో ఉన్నది ఒక్క విన్నపమే!) శఠకోపముని ద్రావిడ వేదానికి కృష్ణమాచార్యుల తెలుగు చేత కావచ్చునని శ్రీనిడుదవోలు ప్రభృతుల భావన. ఈ భావనతోనే చిన్నన్న ద్విపదపంక్తుల్ని అపార్థం చేసుకొన్నారు కూడాను.