33
ఖండంసరి. విడిగా వేదంబు తెనుగు గావించి సంసారఖేదంబుమాన్పిన కృష్ణమాచార్యుణ్ణీ, అని చెప్పి వీటికన్నిటికీ 'తలఁచి అంజలిగావించి' అని ముందరిక్రియతో ఏకాన్వయం చెప్పాలి. నమ్మాళ్వారుల్లాంటి ఆదివణ్ శఠకోపయతినీ, తెనుగు వేదం పలికిన కృష్ణమాచార్యుల్నీ తిరువెంగళనాథుడు స్తుతించేడు. అంతకు ముందే 'ఆళువారలను' విడిగా ప్రస్తుతించేడు. అయితే ఇక్కడ విమర్శకులకు మరో శంక కలిగి ఉండవచ్చు. వేదంబు తెనుగు గావించిన అంటున్నాడుగదా, ఎందులోనో ఉన్న దాన్ని గదా తెనుగు గావించటం. అంచేత శఠకోపమౌని వేదాన్ని కృష్ణమాచార్యులు తెనుగు గావించేడని శంకాపరిహారం చేసుకొని ఉంటారు వారు. అట్లావారు భావిస్తే శఠకోపమునిలాంటి శఠకోపమౌని యొక్క వేదాన్ని తెనుగు జేసినవాడు కృష్ణమాచార్యులు అని అర్ధం లభిస్తుంది. అప్పుడు ఉపమేయ శఠకోపు లెవరు? ఉపమాన శఠకోపు లెవరు? అన్న ప్రశ్నలు బయల్దేరతాయి. ఉపమాన శఠకోపులు ప్రాక్కాలికులు, ఉపమేయుల కంటే మహత్తరులూ కావాలిగద! ఉపమాన శఠకోపుల్ని ఎట్లాగూ నమ్మాళ్వారులనీ ఉపమేయ శఠకోపుల్ని ఇప్పుడేనా ఉపమానభిన్నంగా వ్యక్త్యంతరంగా కడకు ఆదివణ్ శఠకోపయతిగా అంగీకరించక తప్పదు. ఈ ఆదివణ్ శఠకోపయతికి వేదకర్తగా ప్రామాణ్యంకాని ప్రచారం కానీ లేకపోవటమేకాదు. ఈయన మన కృష్ణమాచార్యులకు రమారమీ రెండు శతాబ్దాలు అర్వాక్కాలికుడు. ముందు పుట్టబోయే శఠకోపులు వ్రాయబోయే వేదాన్ని కృష్ణమాచార్యులు ముందే తెనుగు చేసేరంటారా, వార్ని ఆ శఠకోపులే వంచాలి. ఇక్కడ శఠకోపౌపన్యంలో సంబంధార్థం గ్రహించాలి. తిరువెంగళనాథుడే చక్కగా దీన్నిధ్వనించేడు. ఈ ధ్వనిమనవారు వినలేదు. ఉపమాన శఠకోపుల్ని శఠకోప‘ముని' అనీ, ఉపయేయ శఠకోపుల్ని శఠకోప 'మౌని' అనీ అభివర్ణించే రాయన. అంటే నమ్మాళ్వారుల్ని మునిఅనీ వణ్ శఠకోపుల్ని మౌని అనీ పేర్కొన్నాడన్నమాట. మౌని లోని తద్ధితార్థాన్ని ఇక్క డ విశేష దృష్టితో చూడాలి. మునిభావం మౌనం, అదికలవాడు మౌని ఇక్కడ మౌనం శఠకోప సంబంధం. అది గలవాడు శఠకోపమౌని. అంటే