పుట:Sinhagiri-Vachanamulu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

దరూ ఒక చిత్ర విచిత్రమైన బ్రాంతికిలోనై “శఠకోపవిన్నపములు" అనే పేరుతో కనబడుతున్న విన్నపాలే కృష్ణమాచార్యుల తెనుగు వేదం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ప్రకటిస్తున్నారు. కాని అది సరికాదు. వీరందరూ ఇట్లా పొరపడే ఆవకాశం ఇచ్చినవి పై పరమయోగి విలాస పంక్తులే. పూర్వవాక్యాలతో కలిపి వాటిని మరోమారు పరిశీలిస్తే యథార్థం అవగతం అవుతుంది. తొండమాన్ చక్రవర్తినీ, శ్రీమద్రామానుజుల భాగినేయుడు దాశరథినీ, శ్రీపరాశర భట్టార్యులనీ, అనందాళువార్నీ స్తుతించిన తరవాత,

శఠమత రాద్ధాంత సంహారియైన
శఠకోపమునిఁబోలు శఠకోపమౌని,
వేదంబు తెనుగుగావించి సంసార
ఖేదంబు మాన్చిన కృష్ణమాచార్యు.

అని పరమయోగి విలాస పంక్తులున్నాయి. శ్రీనిడుదవోలు వారిదగ్గరనుంచి శ్రీ ఆరుద్రగారివరకూ అందరూ ఇంచుమించు ఈ పంక్తుల్ని అపార్ధమే చేసుకొని, పూర్వపంక్తిలో ఉన్న “శఠకోపమౌని"ని యివతలకు ఈడ్చి ఆయన నెత్తిన వేదాన్ని మోపి, ఆ శఠకోపమౌనియొక్క వేదాన్ని తెనుగుచేసిన కృష్ణమాచార్యులనే తాత్పర్యం సంపాదించి "శఠకోపవిన్నపాలే"యీ తెలుగు వేదం అన్న చమత్కారమైన సిద్ధాంతం ప్రతిపాదించేరు. దీనికితోడు మరో అభాండధ్వనికూడానూ ఇక్కడ— ఈ శఠకోప విన్నపాలకు మాతృకామాత్రమే శ్రీ శఠకోపుల తమిళవేదం అని. మన పరిశోధక విమర్శకులు తాత్పర్యగ్రాహులేకాని ఆన్వయచణులూ చతురులుగా కనపడరు.

వారి ధోరణిలో అన్వయించినప్పుడేనా పై ఉద్ధారంలో రెండోపంక్తిలో ఉన్న ఉపమానవాచకం ఏంకావాలి? అదీగాక ఇద్దరు శఠకోపులు ఇక్కడ కనపడ్డంలేదూ ?

అసలు సమన్వయం ఇదీ.

శఠమతరాద్ధాంత సంహారియైన శఠకోపమునిఁబోలు.
     'శఠకోప' బిరుదాంచితుడైన నమ్మాళ్వారులకు సాటికాదగిన
శఠకోపమౌని(న్) - (అహోబలమఠాధిపతియైన ఆదివణ్ శఠకోపయతినీ.

అని ఇక్కడికీవాక్య