పుట:Sinhagiri-Vachanamulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

అన్ని విధాలా కృష్ణమాచార్యులకు వారసులన దగిన తాళ్ళపాక వారు తామ్రపత్రికలు వేయించటమూ, కృష్ణమాచార్యులు తప్పకుండా తామ్రపత్రికలు వేయించే ఉంటారనటానికి అవార్యమైన అనుమానప్రమాణంగా కనపడుతోంది. తాళ్ళపాకవారి తామ్రపత్రిక పెన్నిధి బయటపడ్డట్టే ఆచార్యులవారి తామ్రపత్రికల నిక్షేపమూ బయటపడాలి. తెలుగు సరస్వతికి శాపవిమోచనం ఎప్పటికో:

తెలుగు వేదం - వచనాలు

కృష్ణమాచార్య వచనాలకు వేదప్రామాణ్యం, తౌల్యం అందులోనే ప్రతిపాదించబడింది. తన సంకీర్తనల్ని పంచమ వేద స్మృతులుగా భావిస్తారాయన. వాటిలో వేదం ఉన్నదంటారా మహానుభావుడు. అవి వేదమే అంటారు కొన్నిచోట్ల. ఇట్లా పంచమవేదస్మృతి ద్వారాను, ఋగాదివేద ప్రామాణ్య ప్రతిపాదనంద్వారాను వాటి విశిష్టతని ఆయనే ప్రకటించేరు. వేదం ఎట్లా పరతత్త్వ ప్రతిపాదకమో. ఉపనిషత్తులు ఎట్లా పరబ్రహ్మస్వరూప నిరూపకాలో ఆయన వచనాలూ అట్లాగే పరతత్వం అయిన శ్రీమన్నారాయణుని స్వరూపరూపగుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కావటంవల్ల ఇవి వేదతుల్యాలు - తెలుగు వేదాలు ఆయేయి.

తమిళ వేదం శఠకోపులు

ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ద్రావిడ వేదం ఆయిన యిర దివ్యప్రబంధం విషయంలో, ముఖ్యంగా శ్రీ శఠకోపసూరుల విషయంలోనూ ఇట్లాంటి సమన్వయమే ఉంది. “వేదంతమిళ్ శెయ్దమారన్ శఠకోపన్" అని వేగాన్ని తమిళం చేసినవారుగా ఆయనకు ఖ్యాతి ఉంది. అంటే చతుర్వేదాలనూ లేకత్రయిని, లేక ఏదో ఒక వేదాన్ని యథామూలంగానో, ఛాయగానో, స్వతంత్రంగానో తమిళ భాషలో అనువదించేరనికాదు. ఇంతకు ముందు చెప్పినట్టే అఖిల హేయప్రత్యనీక కల్యాణ గుణైకతానుడు. త్రివిధ కారణ భూతుడు, చిదచిత్స్వరూపుడూ అయిన శ్రీమన్నారాయణని స్వరూప రూపగుణ విభవాది కీర్తనంలోనే వేదప్రామాణ్యం, తౌల్యమూను. ఈ