పుట:Sinhagiri-Vachanamulu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

నవరత్న పంచరత్న కీర్తనలు

ఇవికాక "సింహాద్రియప్పని సంకీర్తన చేయుచున్నపుడు నవరత్న పంచరత్న సంకీర్తనల జెప్పగా" అనటంవల్ల, నేటికాలంలో త్యాగరాజాదుల పంచరత్న కీర్తనలు ఛందోబద్ధాలుగా కనపడుతూన్నందువల్ల, కృష్ణ మాచార్యులుకూడా ఛందోబద్ధాలైన నవరత్న పంచరత్న కీర్తనలు రచించి ఉంటారనీ తోస్తుంది. వాటి స్వరూపస్వభావాలను గురించి ప్రస్తుతం చెప్పలేం. రాగతాళ సమాశ్రయాలూ, ఛందోబద్ధాలూ అయిన కీర్తనలూ గీతాలూ కృష్ణమాచార్యులు రచించి గానం చేసేవారనటానికి మరో ప్రమాణం ఆయన వచనాల్లోనే కనపడుతోంది. కోడిపుంజుల యుద్ధాన్ని వర్ణిస్తూ దాని కుపమానంగా ఒక గీతం ఉదాహరించేరాయన -ఘటితముఖవరదధిత సంధిత కౌస్తుభాంశు.. మకుట కఠోరవందిత కుంభినీజయ శోభితమ్ కనక ఘనపీతాంబరాచ్యుత కౌస్తు భాజయశోభితమ్. గీత డోలక ఆదిజం కిణికి ణింకిణి కిణికిణింకిణి కిణికిణీంకిణి కిణికిణింకిణి—— దేవా అనాథపతి స్వామీ సీంహగిరినరహరీ" దీన్ని పట్టిచూసినా ఆయన ఇటు వచనగేయాలూ అటు రాగతాళానుగుణాలైన గీతాలూ కూడా రచించేరని చెప్పవచ్చు.

చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు

కృష్ణమాచార్యుల వాజ్మయ పరిమితిని గురించి ప్రస్తుతం చెప్పదగ్గ సాక్ష్యం ఏమీలేదు. ఆయన చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలు చేస్తున్నట్లు చెప్పుకొన్నారు. పలుతావుల్లో. "గ్రంథం" "అంటే 32 మాత్రలనే సంప్రదాయత మనకు ఉంది. మనవారు గ్రంథ పరిమితిని "గ్రంథ" ప్రమాణంతోనే చెప్పేవారు. తమిళంలోనూ దివ్యప్రబంధవ్యాఖ్యాన సంప్రదాయంలో గ్రంథ ప్రమాణ పరిగణనం పరిపాటిగా ఉంది. తమిళంలోకాని సంస్కృతంలో కాని ఏదీ లక్ష దాటినట్టు కనపడదు. భారతమే మనకు లక్ష గ్రంథం. గుణాఢ్యుని బృహత్కథ ఏడులక్షలనీ కధ. కృష్ణ మాచార్య సంకీర్తనం 'పంచమ వేదానికి చతుర్గుణం అన్నమాట! ఈ నిక్షేపం అనుభవించటానికి తెలుగువారు కాచుకోన్నరో లేదో మరి. పోనీ 'చాతుర్లక్ష' ని లక్షక శబ్ధంగా పరిగణించె