Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ప్రస్తావింపబడ్డంత మాత్రంచేత ఇది పరకర్తృకం కానక్కర్లేదు. ఈ ప్రథమ పురుష వ్యవహారం నన్నయగారిలో పోతరాజు గారిలో కూడా చూసినవారికి కృష్ణమానార్యుల్లోనూ విచిత్రం కాదు. ముద్రిత వచనణాల్లోనూ ప్రథమ పురుష వ్యవహారం ఉంది. కాకపోయినా ఆయనను గూర్చిన గ్రంథంగానైనా దీని విలువలను తెలుసుకొని ఉపయోగించుకోవాలి.

శ్రీ ఆరుద్ర వచనం

ఇవి యిల్లా గుండగా శ్రీ తిమ్మావఝ్ఝల కోదండరామయ్యగారు కొన్ని సింహగిరి నరహరి వచనాలు సేకరించి ముద్రణానుకూలంగా సిద్ధం చేసి ఉంటారని శ్రీ ఆరుద్రగారు అంటున్నారు. 1952 లో శ్రీ తిమ్మావఝ్ఝలవారి భారతి వ్యాసం నేనూ చూసేను, కాని ప్రస్తుతం అది నాకు లభించలేదు. దాన్ని గూర్చిన ప్రత్యభిజ్ఞా చాలటం లేదు. శ్రీ ఆనందమూర్తి వ్యాసమూ భారతుల్లోనే చూసిన గుర్తు ఖచ్చితంగా పరామర్శింపలేకపోతు న్నాను, శ్రీ ఆరుద్రగారు "సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర" పద్మనాయక యుగంలో కృష్ణ మాచార్యుల వచనం ఒకటి ఉదాహరించేరు. తంజావూరి నుంచి తాము వచనాలు వ్రాయించి తెప్పించుకొన్నట్లు శ్రీ ఆరుద్రగారు తెలుపుతున్నారు. కానివారిచ్చిన ఆ వచనం తంజావూరి ప్రతిలోదికాదు. తంజాపూరిలో సింహగిరి నరహరి వచనాలు. "విష్ణు నామ సంకీర్తన ఫలం" అన్న పేరుతో ఉన్నట్లు శ్రీ ఆరుద్రగారు పేర్కొన్నారు. ఆ "విష్ణు నామ సంకీర్తన ఫలాన్నే" డా! కుల శేఖరరావుగారు ప్రకటించేరు. దాని కాగితపు వ్రాతప్రతి. 1947 లో వ్రాయించినది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులోనూ ఉంది. శ్రీ ఆరుద్రగారు తమకావచనం ఎక్కడ లభించిందో సరిగా చెప్పలేదు. మద్రాసులోని సింహగిరి వచనాల సంగతి వారు ప్రస్తావించలేదు. వారు కృష్ణ మాచార్యుల్ని గూర్చి చెప్పిన విషయాలకు శ్రీ కోదండరామయ్య గారే ప్రమాణం అని వారి వ్రాతలవల్ల తెలుస్తోంది. ఈ వచనం శ్రీ కోదండరామయ్య గారి దగ్గరనుంచి కాని శ్రీ ఆరుద్రగారు స్వీకరించేరో లేక తామే