Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

డనుర్దాసులాంటి ముష్కరులపై కృపాకటాక్షలహరీశీకరాలను చిందించిన కరుణా సింధువాయన. అట్లాంటి ఆ మహానుభావులు కేవలం ఆచార్యోపాధివహంచి వచ్చేరన్న నెపంతో బుద్ధి చెప్పటానికి ఆయనతో మాకు పనిలేద'నేంత విరసులా: పొతకమూరి భాగవతుల సందర్శనానికి ముందు శ్రీమద్రామానుజులతో ఆచార్యులవారికి “భేటీ" జరిగితే తత్పర్యవసానంగానైనా ఆకథ అట్లానడవదు. పొతకమూరి వారి తరవాత శ్రీమద్రామానుజుల సందర్శనం అందామా అంటే ఆస్వాముల్నే "ఎంబెరుమానార్ల స్వరూపులు"గా భావించిన కృష్ణమాచార్యులు, వారి సందర్శనంతో పశ్చాత్త పడై జీవిత విధానాన్నే మార్చుకొన్న కృష్ణమాచార్యులు తమ సమక్షంలో తాముగా సాక్షాత్కరించిన ఎంబెరుమానార్ల పట్ల రాజసవై ఖరినెట్లా అవలంబిస్తారు? సింహగిరి నరహరి వచనాలు ఎప్పటికైనా బయటకు వస్తాయనే ఊహచాలక “అంధాభిజాత్యం" తో “వాది భీకరగురులు" కేశవాచార్యులకు ఈ “కథ" చెప్పేరేమో ! ఇది కేవలం కృష్ణమాచార్యుల సంస్కరణ భావాలు, విప్లొవక దృష్టి కిట్టని అభి జాత్యసంపన్న కుటుంబాల వారు కల్పించిన కట్టుకథ తప్పమరేమీకాదు.ఈ కథ ఆచార్యసూక్తి ముక్తా వళిలో తప్పమరే శ్రీవైష్ణవ చారిత్రక గ్రంథంలోనూ లేకపోవటం కూడా ఈ ప్రకరణంలో గమనించాలి. బంధురభక్తి భావమహితులూ మహనీయ దివ్యభావ భరితులూ చాతుర్లక్ష గ్రంథ స్వరూపులూ, తెనుగు వేదద్రష్ట, సంకీర్తన వాజ్మయ ద్రష్ట ఆర్తి గలవారూ, అందం చూడగల వారూ ఆయిన కృష్ణమాచార్యులు శ్రీ మద్రామానుజుల్ని సందర్శించిఉంటే తెలుగు దేశపు వైష్ణవ చరిత్ర తీరే వేరుగా ఉండి ఉండేది. భగవద్యామునమునుల్ని శ్రీమద్రామానుజులు సందర్శించ లేనట్లే శ్రీమద్రామానుజుల్ని శ్రీ కృష్ణమాచార్యులు సందర్శించలేదేమో ! ఈ కథకల్పించినవారు రామానుజ సమకాలికత్వంద్వారా కృష్ణమాచార్యులకు ఆంధ్ర వాజ్మయంలో కాని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కాని ముందు పీటవెయ్యటం కొసంకాని, ఈ రూపంగా శ్రీ మద్రామానుజుల మహత్వాన్ని ప్రతిష్టాపించటం కోసం కాని పాటుపడ్డవారు కాదు మణి కేవలం శ్రీ వైష్టవ సంప్రదాయంలో పట్టిన ఆచార్యవ్యవస్థా ప్రాముఖ్యాన్ని ప్రతిపాదించటం