పుట:Sinhagiri-Vachanamulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

21

షోడశమహాదానంబులు గంగానదీస్నానంబులు పితృదేవతాతర్పణంబులు ఇవి యిన్నిన్నీ మీ దివ్యనామసంకీర్తన భూతాంతర్యామిగాన శిరిసుజన్మకర్మంబు శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

23

దేవా, భాగవతులసేవ, ఆచార్యులకైంకర్యము —— ఇదియేమరియున్న నరుండు సారమేయ గ్రామసూకరములట! ప్రధారియై యొనరించును. సదాధగవత్సేవా సత్క్రియలొనరించుచుండి మా సింహగిరి నరహరికి.......కతంబడడు.

24

దేవా! అభ్యసింపగా రానివి రెండు, సదాచార్యుల కటాక్షంబొకటియు మీ దాసుండై యుండుటొకటియు. అవిగాన అభ్యసింపగా రానివి రెండున్ను. అదిగనక యెరింగి నడుచుకొనవలయును. శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

25

దేవా! పతి తనమీదను కరుణగలండని సతియానందించినట్లే మీ దయావిశేషము నామీద గలదని యానందించి యున్నాడను. ఈ యానందింపు తుదిముట్టించుమీ. నన్ను మీ దాసానుదాసునిగా జేయవే. సింహగిరి నరహరీ!

26

దేవా, మీ దాసుల యనుగ్రహంబులేక మీదివ్య పదాధికారంబులేదు. మీ దాసుల యనుగ్రహంబు లేక యీ కర్మ సాగరంబు గడపరాదు. సూర్యరశ్మి హస్తంబున ధరియింప వశమా! ఈ లోకంబు మనుజులకును శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ! మీ దాసులు సర్వమాన్యులౌట గాన నే నెరింగితిని దేవా.