Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

సింహగిరి వచనములు

దహించినపుడె నీకు యెదురెవ్వరె, దేవా! నీవు మనుష్యుని కడుపునంబుట్టి నీ సత్యంబు నీ వెరుంగవు గాక! నీవు అయోధ్యలోనుండి ఒక బాణము సంధించిన రావణాసురు సంహరించి, వాని మీ శ్రీపాదములకు మ్రొక్కినంతనే వాడు చేసిన దోషంబులెల్ల విరుగడాయ వాడు ముక్తింబొందడా! వాని దేహతేజంబు జూచి లక్ష్మణు బిలిచి సీతామహాదేవిని ప్రమాణము పరికించుకొమ్మని యాడితిరి. ఆలాగె లక్ష్మణుండు సీతామహాదేవిని ప్రమాణంబు పలికించిరి. ఆ మహాత్మురాలు అన్యథా యెరుంగదు గనుక ప్రమాణంబు గెలిచెను. ఆ ప్రమాణంబు గెల్చిన దోషంబు నీకు యెన్ని యుగంబులం దొలంగునే, దేవా! చాతుర్లక్ష గ్రంధసంకీర్తనము వలన దశావతారుండవై చేసిన దోషంబులెల్ల బాసెను. రఘునాథుండవై చేసిన దోషము లెల్లంబాసెను. నా వలన నీకు ముక్తి కలిగెను. నీవలన నాకు ముక్తి కలిగెను. నీవు దశావతారుండవు. నేను పదునొకండవ యవతారుండను. నీవు నరమృగమవు! నేను నరకేసరిని! నీవలన నాకు కైవల్యంబవుట. అనాది పూర్వకృతఫలమేగదా! శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

21

దేవా! ఏమని నుతియింతు మిమ్ము? కులపర్వతము లేడుదీవులతో ధరయెత్తిన మీరు గోవర్ధగిరి నెత్తితిరని యేమని నుతియింతు? కాల సంహారుండవై, జగత్తు లయంబు జేసి మీరు కంస కాళింగమర్దన నరకాసురుండాదిగా గల రాక్షసుల హతంబు చేసితివని యేమని నుతియింతు, సప్తసాగరములు మీ రోమకూపముల సరిలేవు, నీవు జలధి నిందించితివని యేమని నుతియింతు? మీ సతికరుణాలేశమున సకలదేవతలు రాజ్యవిభవ సంపన్ను లైనారు. బలి నడిగితిరని యేమని నుతియింతు? మీ దాసులు జన్మ మరణాదిభయరహితులైనారు. మీరు దశావతారమున తిరువ నవధరించితిరిగాన యేమని సుతియింతు? శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

22

దేవా! అకారణ సుకృతివై రక్షింతువు గావున దేవా! జపతపధ్యానాదితంబులు మొదలైనవి. అశ్వమేధంబులు మొదలైనవి యాగంబులు