పుట:Sinhagiri-Vachanamulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

19

తల్లిదండ్రాదులు చేసిన దోషంబు నీకు అనుభవింప గారణమని అరణ్యానకు యేగితివి. దేవా, మీకు యెవ్వరు తల్లి? యెవ్వరు తండ్రి? నీవు జగద్భరితుండవు. నీవు మహాత్ముండవని నీకు మ్రొక్కిన దోషంబు. నీవు నరుని కడుపునం జనియించి జగత్తులు నావని వహించనేరవై తివి. దేవా! కరుణానిధివి. ఆనాదిపతివి. శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ!

19

దేవా! పర్ణశాలల వసించినాడవు. నీకేల అరణ్యానకేగ? నీకేల ఉపవాసములుండ నీకేల నారచీరలు గట్ట? నీకేమి కారణము దేవా! నీకు కూరలు కాయలు అన్నంబు భుజియింప నేమి కారణము? దేవా! నీవు గతపూర్వంబున చేసిన కర్మంబు వదల్చుకోలేవు నిన్ను నుతియించిన కర్మంబులు పాయునని నరులు నీకు మొక్కుదురు గదవయ్యా! నీ కర్మంబులు నీవు వదుల్చుకోలేవుగాక, నీవు మానవుని యింటంబుట్టి యెరుంగవు గాక! మీ దాసులు వ్యాసపరాశర పుండరీకాంబరీష శుకశౌనక ప్రహ్లాదులు మీ దాసులు మీరు మ్రొక్కుదురు. నీవు చేసిన ద్రోహంబు లెరుంగుదురు. వీరికి భయస్థుండవై యుండుదువు గాన. దేవా! పరమరహస్యంబున నేను నితయించినాడను. నన్ను గావవే! శ్రీకృష్ణకువ్వారు స్వామీ! సింహగిరి నరహరీ!

20

దేవా! నీవు అశ్వమేధ యాగాధికారుండవై యాగము చేసితివే. దేవా, నీ కర్మంబులు చూడనె దోషంబు ధర్మకర్మములు పాలించవైతివి. అధర్మివి నీవు. సుకృతా ధర్మంబులు లేవుకదా! నీ వలను. నీవు నరుని కడుపునంబుట్టిన జ్ఞానముదప్పెగాక! నీకు శిరిశానవేల్పులు. నీకుటమి కారణమున వారధి గట్టెదవు. నీవు విష్ణుమాయ ప్రపంచకము చేసి వడినేడు సముద్రంబు లేకమైయున్ననాడు ఏకస్వరూపంబున నుండవా. నీవు! రఘుకులోద్భవుండవై అంబుధి యెరుంగవు గాక! ఆదినారాయణ మహత్వంబు