పుట:Sinhagiri-Vachanamulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

15

ముడిగి మా సింహగిరినరహరి నామమొక్కమారు దలంచినచాలును ఇదియే సత్యము, సత్యము. ఇదియె, నాకును జపము. ఇదియె, నాకును తపము. ఇదియె, నాకును నిత్యకర్మానుష్ఠానమయినది. ఇదియె, నాకును పరమ మంత్ర రహస్యము. ఇదియె, పరమ ధర్మము. ఇదియే, నాకును వేదశాస్త్రపఠనంబిదియె, సింహగిరి నరహరీ! మీ దివ్యనామము. ఇదియే నాకు జపము, దయానిధీ!

8

దేవా! వ్యాస పరాశర శుక శౌనకాదులైన ఋషులందరు గూడి వాసుదేవులచే పరతత్వమని వైకుంఠనివాసుం గాంచిరి. దైవమాయయో! నరులపాలిటి కర్మమో! పెక్కు దైవములు గలరని తిరిగిచెందెదరు. ఎక్కడగలడన్న, ఆక్కడనే హరి గలడను మాట నిక్కమో లోకములవారా! ఎక్కడ ద్రౌపది? ఎక్కడ ద్వారక! ఎక్కడికెక్కడ! శరణన్న గాచుట యెరుంగరా! జగములీరేడు గెల్వనోపిన మగలేగురు తలలెత్తి అలుగకుండంగ -ద్రౌపది తనమనంబున గదర, “కృష్ణా, నీవే గతి. నీ చెలియలింగావు" మనినం గాచెను. కరి మకరితో బోరుచు, కరి లావుతరగి మొర పెట్టుచో,గలరో దేవతలైనం గావవే హరి! యన్నను గాచుట యెరుంగరా! ఇట్టి సింహమందిరుం గొలిచి ఇంద్రాది దేవతలైరి. శ్రీ కృష్ణ కువ్వారు స్వామి, సింహగిరి నరహరీ!

9

దేవా! ఇతడే ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండు. ఇతని నాభియందు బ్రహ్మాడంబు పుట్టె. బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టె. బ్రహ్మ లలాటంబున హరుండు పుట్టె. హరుని యుగ్రమున కూర్మము మోచిన కుంభినిధరణి ఊష్ణమున జలధి పుట్టె. జలధి కల్పమున మండలము పుట్టె. మండల సర్పమునందు వేదశాస్ర పురాణకల్పములు పుట్టె. వేదశాస్త్ర